AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు మరో అరుదైన గౌరవం.. ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌పై..

RRR Movie: ఒక్క టాలీవుడ్‌ ఇండస్ట్రీ (Tollywood) మాత్రమే కాకుండా యావత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ ఇప్పుడు వేయి కళ్లతో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. అపజయం అంటూ ఎరగని రాజమౌళి...

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు మరో అరుదైన గౌరవం.. ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌పై..
Rrr Movie
Narender Vaitla
|

Updated on: Mar 03, 2022 | 6:35 AM

Share

RRR Movie: ఒక్క టాలీవుడ్‌ ఇండస్ట్రీ (Tollywood) మాత్రమే కాకుండా యావత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ ఇప్పుడు వేయి కళ్లతో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. అపజయం అంటూ ఎరగని రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహిస్తుండడం.. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు (Ramcharan, NTR) కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడా లేని అంచనాలు పెరిగాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను అంతే భారీగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సిద్ధమవుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకులకు ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా కరోనా ఆంక్షలు పూర్తిగా తొలగిపోవడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదలకు సిద్ధమైంది. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ఈ సినిమా సందడి చేయనుంది.

ఇక దేశంలోని దాదాపు అన్ని భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా విడుదలవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదలకానుంది. ఈ నేపథ్యంలో తాజాగా అందుతోన్న సమాచారం మేరకు ఆర్ఆర్‌ఆర్‌ సినిమా ప్రీమియర్‌ షో యూకేలోని ఓడియన్ బీఎఫ్‌ఐ ఐమ్యాక్స్‌ థియేటర్‌లో ప్రదర్శిచం కానుందని తెలుస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌గా ఈ థియేటర్‌కు పేరుండడం విశేషం. అంతేకాదు ఒక్క యూకేలోనే ఆర్‌ఆర్‌ఆర్‌ ఏకంగా వెయ్యికిపైగా స్క్రీన్స్‌లో విడుదల కానుంది. దీనిబట్టే ఆర్‌ఆర్‌ఆర్‌ క్రేజ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఆలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సముద్రఖని, శ్రియా, అజయ్ దేవ్ గన్ ఇతర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కరోనా కారణంగా చిత్ర ప్రమోషన్స్‌ను వాయిదా వేసిన చిత్ర యూనిట్‌ తాజాగా మళ్లీ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. త్వరలోనే సినిమా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ను దుబాయ్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం.

Also Read: Lahari Shari: అప్పుడు BMW బైక్‌, ఇప్పుడేమో లగ్జరీ కారు కొన్న బిగ్‌బాస్‌ బ్యూటీ లహరి.. ధరెంతో తెలుసా..

Central Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారా.. అయితే మీ కోసమే ఈ వార్త..

Yami Gautam: ఆమె మనసూ అందమైనదే.. ఫెయిర్‌ అండ్ లవ్లీ బ్యూటీపై ప్రశంసలు కురిపిస్తోన్న ఫ్యాన్స్‌.. కారణమేంటంటే..