రూ.కోటి విలువ చేసే ఇల్లు కానుకగా…

రూ.కోటి విలువ చేసే ఇల్లు కానుకగా...

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం ‘భైరవి’  1978లో రాగా, కలైజ్ఞానం అనే నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించారు. అదీ సోలో హీరోగా నిర్మించారు. అయితే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రముఖ నిర్మాత-రచయిత కలైజ్ఞానంకు రూ.కోటి విలువ చేసే ఇల్లును కానుకగా ఇచ్చారట. ఆగస్టు 14న కలైజ్ఞానం సన్మానసభ జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు భారతీరాజా, రజనీకాంత్‌, శివకుమార్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శివకుమార్‌ వేదికపై మాట్లాడుతూ.. కలైజ్ఞానం ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నారని, […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Aug 31, 2019 | 6:38 AM

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం ‘భైరవి’  1978లో రాగా, కలైజ్ఞానం అనే నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించారు. అదీ సోలో హీరోగా నిర్మించారు. అయితే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రముఖ నిర్మాత-రచయిత కలైజ్ఞానంకు రూ.కోటి విలువ చేసే ఇల్లును కానుకగా ఇచ్చారట. ఆగస్టు 14న కలైజ్ఞానం సన్మానసభ జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు భారతీరాజా, రజనీకాంత్‌, శివకుమార్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శివకుమార్‌ వేదికపై మాట్లాడుతూ.. కలైజ్ఞానం ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నారని, ఆయన సొంత ఇల్లు నిర్మించుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. ఇది విన్న రజనీ కల్పించుకుని.. ‘నేను ఇల్లు కొనిస్తాను. ఈ అవకాశాన్ని తమిళనాడు ప్రభుత్వానికి ఇవ్వను. త్వరలోనే కలైజ్ఞానంకు సొంత ఇల్లు ఉంటుంది. మరో పదిరోజుల్లో నగదు ఆయన చేతిలో పెడతాను’ అని చెప్పారు.

కాగా ఇప్పుడు రజనీ రూ.కోటి విలువ చేసే ఇల్లు కొని, ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పనుల్ని భారతీరాజా చూసుకున్నారని చెబుతున్నారు. మరికొందరేమో ఇంకా ఆయన ఇంటిని వెతుకుతున్నారని రాసుకొచ్చాయి. అయితే దీనిపై కలైజ్ఞానం, రజనీ ఇంకా స్పందించలేదు. రజనీ సోలోగా నటించిన తొలి సినిమా ‘భైరవి’ను (1978) కలైజ్ఞానం నిర్మించారు. ‘భైరవి’ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని పలు సందర్భాల్లో తలైవా అన్నారు. ఆయన ప్రస్తుతం తన తర్వాతి సినిమా ‘దర్బార్‌’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu