AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arshdeep Singh : వాంఖడేలో సింగ్ ఈజ్ కింగ్.. పంజాబ్ కింగ్స్ తరపున 100 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా చరిత్ర

Arshdeep Singh : రిక్కెల్టన్‌ను అవుట్ చేయగానే అర్ష్‌దీప్ తన ఐపీఎల్ కెరీర్‌లో 100 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఐదో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌గా అతడు నిలిచాడు. అంతేకాదు, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తరపున 100 వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి పేసర్గా అర్ష్‌దీప్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Arshdeep Singh : వాంఖడేలో సింగ్ ఈజ్ కింగ్.. పంజాబ్ కింగ్స్ తరపున 100 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా చరిత్ర
Arshdeep Singh
Rakesh
|

Updated on: Apr 17, 2026 | 7:40 AM

Share

Arshdeep Singh : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డాడు. వాంఖడే స్టేడియంలో ముంబై టాప్ ఆర్డర్‌ను పేకమేడలా కూల్చేయడమే కాకుండా, తన ఐపీఎల్ కెరీర్‌లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వరుసగా రెండు బంతుల్లో ఇద్దరు స్టార్ బ్యాటర్లను అవుట్ చేసి, ఐపీఎల్‌లో 100 వికెట్ల క్లబ్‌లో చేరిన ఐదో లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా రికార్డు సృష్టించాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన పోరులో అర్ష్‌దీప్ సింగ్ ఆరంభం నుంచే అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు. తన రెండో ఓవర్‌లోనే మ్యాజిక్ చేసిన అర్ష్‌దీప్, తొలి బంతికే రిక్కెల్టన్‌ను అవుట్ చేసి పెవిలియన్ పంపాడు. ఆ మరుసటి బంతికే డేంజర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను డకౌట్ చేసి ముంబైని కోలుకోలేని దెబ్బ తీశాడు. దీంతో కేవలం రెండు బంతుల్లోనే ముంబై టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. హ్యాట్రిక్ సాధించే అవకాశం వచ్చినప్పటికీ నమన్ ధీర్ అడ్డుకున్నాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీశాడు.

చరిత్ర సృష్టించిన 100వ వికెట్

రిక్కెల్టన్‌ను అవుట్ చేయగానే అర్ష్‌దీప్ తన ఐపీఎల్ కెరీర్‌లో 100 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఐదో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌గా అతడు నిలిచాడు. అంతేకాదు, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తరపున 100 వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి పేసర్గా అర్ష్‌దీప్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2019లో కేవలం 20 లక్షల రూపాయల బేస్ ప్రైస్‌కు పంజాబ్ జట్టులోకి చేరిన ఈ కుర్రాడు, నేడు ఆ జట్టుకు ప్రధాన ఆయుధంగా మారాడు.

విమర్శలకు వికెట్లతో సమాధానం

గత కొన్ని మ్యాచులుగా అర్ష్‌దీప్ ఫామ్ పై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పవర్‌ప్లేలో వికెట్లు తీయలేకపోతున్నాడనే విమర్శలకు ఈ మ్యాచ్‌తో గట్టి సమాధానం చెప్పాడు. దాదాపు 10 ఇన్నింగ్స్ తర్వాత, అంటే 21.1 ఓవర్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ పవర్‌ప్లేలో అర్ష్‌దీప్ వికెట్లు సాధించడం విశేషం. కీలక సమయంలో వికెట్లు తీసి జట్టుకు ముందంజ వేయడంలో తనకెవరూ సాటిలేరని మరోసారి నిరూపించుకున్నాడు.

అర్ష్‌దీప్ ఖాతాలో మరికొన్ని రికార్డులు

అర్ష్‌దీప్ సింగ్ కేవలం ఐపీఎల్‌లోనే కాదు, టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కూడా 100కు పైగా వికెట్లు తీసిన రికార్డు కలిగి ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. గతంలో ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకున్న ఈ పంజాబ్ పేసర్, తన యార్కర్లతో, స్వింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నేటి ప్రదర్శనతో ఐపీఎల్ 2026 పర్పుల్ క్యాప్ రేసులోకి కూడా దూసుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ ఇద్దరి ఉసురు తగిలిద్ది.. ఏడాది రెస్ట్ తీసుకో బుమ్రా..!
ఆ ఇద్దరి ఉసురు తగిలిద్ది.. ఏడాది రెస్ట్ తీసుకో బుమ్రా..!
అదృష్టమంటే ఇదేనా.. చెత్తబుట్టలో రూ.10.9 కోట్లు.. ఈ కథ తెలిస్తే..
అదృష్టమంటే ఇదేనా.. చెత్తబుట్టలో రూ.10.9 కోట్లు.. ఈ కథ తెలిస్తే..
OTTలో దుమ్మురేపుతోన్న నాగదుర్గ సినిమా.. ఇండియా వైడ్‌గా టాప్‌లో...
OTTలో దుమ్మురేపుతోన్న నాగదుర్గ సినిమా.. ఇండియా వైడ్‌గా టాప్‌లో...
అసలు కంటే వడ్డీయే ఎక్కువ కడుతున్నారా.. హోమ్ లోన్ భారాన్ని..
అసలు కంటే వడ్డీయే ఎక్కువ కడుతున్నారా.. హోమ్ లోన్ భారాన్ని..
విశాఖ రాథోడ్ మామూల్ది కాదు.. ఏం చేసిందో తెలుసా..?
విశాఖ రాథోడ్ మామూల్ది కాదు.. ఏం చేసిందో తెలుసా..?
స్టేజ్ పై చెంప మీద పదే పదే కొట్టుకున్న నటుడు..
స్టేజ్ పై చెంప మీద పదే పదే కొట్టుకున్న నటుడు..
వెండి జ్యూవెలరీ కొనాలని అనుకుంటున్నారా? దేశంలోనే బెస్ట్ సిటీ ఇదే!
వెండి జ్యూవెలరీ కొనాలని అనుకుంటున్నారా? దేశంలోనే బెస్ట్ సిటీ ఇదే!
రాజమండ్రిలో ఘోరం.. మెడికోను కారుతో ఢీకొట్టిన యువకులు..
రాజమండ్రిలో ఘోరం.. మెడికోను కారుతో ఢీకొట్టిన యువకులు..
ట్రంప్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ
ట్రంప్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ
విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్ ఆసక్తికర కామెంట్స్..
విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్ ఆసక్తికర కామెంట్స్..