Aishwarya Dhanush: తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్న రజనీకాంత్ కూతురు… అధికారికంగా ప్రకటించిన లైకా ప్రొడక్షన్..
Aishwarya Dhanush: ధనుష్ హీరోగా తెరకెక్కిన '3' సినిమాతో తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేప్టటారు ఐశ్వర్య ధనుష్. సూపర్ స్టార్ రజినీకాంత్‌లాంటి బడా హీరో వారసత్వం ఉన్నా..

Aishwarya Dhanush: ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘3’ సినిమాతో తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేప్టటారు ఐశ్వర్య ధనుష్. సూపర్ స్టార్ రజినీకాంత్‌లాంటి బడా హీరో వారసత్వం ఉన్నా తన సొంత ప్రతిభతోనే ఐశ్వర్య మంచి పేరు సంపాదించుకున్నారు. ‘3’ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా, దర్శకురాలిగా మాత్రం ఐశ్వర్యకు మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఐశ్వర్య తమిళంలో మరో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించినా అవి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. 2017లో చివరి చిత్రానికి దర్శకత్వం వహించిన ఐశ్వర్య ఆ తర్వాత మరో సినిమాకు దర్శకత్వం వహించలేరని చెప్పాలి. ఇక తాజాగా ఈ లేడీ మూవీ మేకర్ మరో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.
అయితే ఐశ్వర్య ఈసారి తన కొత్త సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. లైకా ప్రొడక్షన్ తెరకెక్కిస్తున్న బహు భాష చిత్రానికి ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని లైకా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయమైన ట్వీట్ చేస్తూ..’సంజీవ్ అనే రచయిత రాసిన కథకు ఐశ్వర్య దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేయనున్నాము. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ నిర్మాతలు సుబాస్కరణ్, మహవీర్ జెయిన్ సింగ్‌లు తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది’ అంటూ పేర్కొన్నారు. నటీనటులు ఎవరన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఐశ్వర్య భర్త ధనుష్ ఇప్పటికే తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఐశ్వర్య కూడా తెలుగులోకి ఎంట్రీ ఇస్తుండడం విశేషం.
Lyca Production’s Producers #Subaskaran & #MahaveerJain sign @ash_r_dhanush to Direct a bilingual thriller, Written by #Sanjeev. This family entertainer will be Presented by Lyca Productions.#aishwarya_r_dhanush#aashishsingh pic.twitter.com/NbZFR7mb8N
— Lyca Productions (@LycaProductions) October 2, 2021
Also Read: Payal Rajput: సొగసు చూడతరమా.. పాయల్ పరువాలు పొగడతరమా… మత్తెక్కిస్తున్న హాట్ బ్యూటీ..
Siddharth Tweet: నెట్టింట తెగ వైరలవుతోన్న హీరో సిద్దార్థ్ లేటెస్ట్ ట్వీట్..\
బూరెబుగ్గలతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. కనిపెట్టారా..?