సస్పెన్స్ విడుతుంది.. పార్టీ పై ప్రకటన.. సింబల్ ఏంటీ?.. తమిళనాట ఇదే పెద్ద చర్చ..
మొన్నటి వరకు ఉన్న సస్పెన్స్‌కు తలైవా తెరదించారు. రాజకీయ ప్రకటనతో ఒక్కసారిగా హీట్ పుట్టించారు. ఇటీవల ఫ్యాన్స్ మధ్యకు వచ్చి కొత్తపార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు.
మొన్నటి వరకు ఉన్న సస్పెన్స్‌కు తలైవా తెరదించారు. రాజకీయ ప్రకటనతో ఒక్కసారిగా హీట్ పుట్టించారు. ఇటీవల ఫ్యాన్స్ మధ్యకు వచ్చి కొత్తపార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటన దేశరాజకీయాల్లోనూ అటు పొలిటికల్ చర్చకు దారితీసింది.
రజనీకాంత్ పార్టీ ప్రకటనతో తమిళనాడులో పొలిటికల్ హీట్ పెరిగింది. అటు అభిమాన సంఘాలతో వరుస భేటీలు జరుగుతున్నాయి. కొత్తపార్టీ ప్రకటన, సింబల్, జెండాపై సుధీర్ఘంగా చర్చిస్తున్నారు పార్టీ ముఖ్యులు అర్జున్‌మూర్తి, తమిళరవి మణియన్. ప్రధానంగా బాబా మూవీలో వేలిముద్ర డైలాగ్స్‌తో ప్రజలకు చేరువైన తలైవా…అదే సింబల్ గుర్తుగా ఉంటే కలిసొస్తుందనే టాక్ వినిపిస్తోంది. రజినీ యోగముద్రకోసం ఈసీ దగ్గర కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. దాంతోపాటు అన్నామలై చిత్రం గెటప్‌ను తలపించే విధంగా సైకిల్, పాలక్యాన్‌తో ఉండే రజినీ స్టైల్ సింబల్ కూడా పరిశీలనలో ఉంది. మక్కల్ మండ్రమ్ అభిమాన సంఘాల నేతలు సూచించిన ఈ రెండు గుర్తులపై ఇక కబాలి డెసిషనే ఫైనల్‌గా ఉండే అవకాశం ఉంది.
వచ్చే యేడాది తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో కబాలి 31 జిల్లాల అభిమాన సంఘాలతో వరుసగా చర్చలు జరుపుతున్నారు. తన సన్నిహితులతోనూ పార్టీ ఏర్పాటుపై కీలక భేటీ జరిపినట్టు తెలుస్తోంది.
రజినీకాంత్ జనవరిలో పార్టీ ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతున్నట్టు తమిళమీడియా కోడై కూస్తోంది. దక్షిణ తమిళనాడులో బలమైన కేడర్ ఉండటంతో మధురైలోనే పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలన్నది ఆయన ప్లాన్‌గా తెలుస్తోంది. అక్కడ సభకు కూడా ఏర్పాట్లు జరిగిపోతున్నాయట. వర్చువల్‌గా ప్రజలకు మరింత చేరువయ్యే యోచనలో రజినీకాంత్ కనిపిస్తున్నారు. ఇటు రజినీకాంత్ బర్త్‌డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు పెద్దఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. అటు తిరువణ్ణామలైలో రజినీ పార్టీకోసం ఫ్యాన్స్ యాగాలు చేశారు.