మోనాల్ రుణం తీర్చుకున్న హారిక.. తెలుగులో అదరగొట్టిన గుజరాతీ భామ.. నేను పర్ఫెక్ట్ కాదు కానీ..
బిగ్‌బాస్ సీజన్ 4 చివరిదశకు రావడంతో ఆట రసవత్తరంగా మారింది. టైటిల్ రేస్‌లో ఆరుగురు సభ్యులు ఉండడంతో బిగ్‌బాస్ వాళ్ళ ఎమోషన్స్‌కు క్లిక్ అయ్యేలా టాస్క్‌లు ఇస్తున్నాడు.
Big Boss Season 4: బిగ్‌బాస్ సీజన్ 4 చివరిదశకు రావడంతో ఆట రసవత్తరంగా మారింది. టైటిల్ రేస్‌లో ఆరుగురు సభ్యులు ఉండడంతో బిగ్‌బాస్ వాళ్ళ ఎమోషన్స్‌కు క్లిక్ అయ్యేలా టాస్క్‌లు ఇస్తున్నాడు. కాగా శుక్రవారం నాటి ఎపిసోడ్లో తక్కువ సైజ్ ఉన్న షూస్ ధరించి స్టేజ్‌పై ఆపకుండా డాన్స్ చేయాలి. ఈ టాస్క్‌లో అఖిల్ న్యాయనిర్ణేతగా వ్యవహరించాలని బిగ్‌బాస్ చెప్పాడు.
అయితే ఇందులో మొదట అభి టాస్క్ కండిషన్స్ మర్చిపోయి కింద కూర్చోవడంతో అవూట్ అయిపోయాడు. రెండవ సారి నేను అల్రెడీ ప్రేక్షకులను ఓట్లు అడగడానికి హౌస్ మేట్స్‌కి అవకాశం కల్పిస్తూన్నాను అంటూ స్టేజి దిగిపోయింది. ఇక మూడవ సారి సోహైల్ దిగిపోవడంతో ఆఖరుగా మోనాల్, హారిక మాత్రమే మిగిలారు. అయితే ఇది నాకు చాలా ఇంపార్టెంట్.. నాకు కావాలి అని హారికను రిక్వెస్ట్ చేసింది మోనాల్. నన్ను ఎత్తుకొని కెప్టెన్‌ని చేశావు.. అందుకే నీకు గోల్డ్ మైక్ అవకాశం ఇస్తున్నా అంటూ డ్రాప్ అయ్యింది హారిక. దీంతో మోనాల్‌కి గోల్డ్ మైక్ ఛాన్స్ లభించింది. గోవిందా.. జై శ్రీక్రిష్ణ అంటూ గోల్డ్ మైక్ తీసుకొని కన్ఫెషన్ రూంలోకి వెళ్ళింది మోనాల్. “గుజరాత్ నుంచి వచ్చిన నన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు వందనాలు. ఈ హౌస్‌కి వచ్చే టైంకి నాకు తెలుగు రాదు. 14 వారాల్లో తెలుగు నేర్చుకున్నా.. 15వ వారం నాకు చాలా ఇంపార్టెంట్. దయచేసి నాకు ఓట్లు వేయండి. నేను పర్ఫెక్ట్ కాదు కానీ.. చాలా మార్పులు నేర్చుకున్నా”.. అంటూ ప్రేక్షకుల్ని ఓట్లు రిక్వేస్ట్ చేసింది. అనంతరం గార్డెన్ ఏరియాకు వచ్చి సంతోషంతో బిగ్‌బాస్‌కు హగ్‌లు, ఫ్లైయింగ్ కిస్‌లు ఇచ్చేసింది ఈ గుజరాతీ భామ.