సూపర్ స్టార్ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం రజినీకాంత్… 70వ పడిలోకి అడుగు పెట్టిన తలైవా

సూపర్ స్టార్ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం ఆయన. స్టైల్ లో ఆయనను మించిన మించిన వారు లేరు. హీరోయిజం అంటే ఆయనను ఉదాహరణగా చూపించవచ్చు. ఆయనే తలైవా రజినీకాంత్. ఇప్పటి హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేసి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటుంటే అప్పట్లోనే సూపర్ స్టార్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు.

సూపర్ స్టార్ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం రజినీకాంత్... 70వ పడిలోకి అడుగు పెట్టిన తలైవా
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 12, 2020 | 7:20 AM

సూపర్ స్టార్ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం ఆయన. స్టైల్ లో ఆయనను మించిన వారు లేనే లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హీరోయిజం అంటే ఆయనను ఉదాహరణగా చూపించవచ్చు. ఆయనే తలైవా రజినీకాంత్. ఇప్పటి హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేసి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటుంటే అప్పట్లోనే సూపర్ స్టార్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. నేటితో 70వ పడిలోకి అడుగు పెట్టారు రజిని. రజనీకాంత్ 1950 డిసెంబర్ 12న మహారాష్ట్రలో జన్మించారు. ఆయన అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్.

మహారాష్ట్రలో పుట్టి పెరిగిన ఆయన.. ఆ తర్వాత ఉద్యోగరీత్యా కర్ణాటకకు మకాం మార్చారు. 1973లో బెంగళూర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లో కండక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. నటనపై ఉన్న ఆసక్తి, స్నేహితుల ప్రోత్సాహం కారణంగా సినిమా రంగం వైపు పయనమైయ్యారు. బాల చందర్ సినిమా ‘అపూర్వ రాగంగళ్’తో తొలిసారిగా తమిళ తెరపై కనిపించారు. తొలి సినిమాతోనే మంచి నటుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడూ ఆయనకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.

ఎన్నో సూపర్ హిట్ సినిమాలను భారతీయ ప్రేక్షకులకు అందించారు. సినీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించారు.ఇక సూపర్ స్టార్ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళ సినిమా నుంచి నటుడిగా మొదలైన ఆయన.. ఇంతింతై వటుండితై అన్నట్లు భారత సినీ పరిశ్రమ గర్వించే స్థాయికి ఎదిగారు. అంతర్జాతీయంగానూ పేరు ప్రతిష్టలు, అభిమానులను సంపాదించుకున్నారుఇక ఎప్పటినుంచో రజినీకాంత్  రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ కోరిక కూడా ఇప్పుడు తీరబోతుంది.