నేనెందుకు సారీ చెప్పాలి?- రాధా రవి

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు రాధా రవి మరోసారి వార్తల్లో నిలిచారు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ నయనతారపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్రమైన ట్రాల్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తమిళ చిత్ర పరిశ్రమలోని నటీనటులు కూడా తీవ్ర స్థాయిలో రియాక్టయ్యారు. వివాదం ముదిరిపోతుండంతో స్పందించిన రాధారవి  ‘నా మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి’ అన్నారు. అయితే ఇప్పుడు నయనతారకు ఎందుకు క్షమాపణ చెప్పాలి? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ‘ఎనక్కు […]

నేనెందుకు సారీ చెప్పాలి?- రాధా రవి
Follow us

|

Updated on: Apr 10, 2019 | 5:20 PM

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు రాధా రవి మరోసారి వార్తల్లో నిలిచారు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ నయనతారపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్రమైన ట్రాల్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తమిళ చిత్ర పరిశ్రమలోని నటీనటులు కూడా తీవ్ర స్థాయిలో రియాక్టయ్యారు. వివాదం ముదిరిపోతుండంతో స్పందించిన రాధారవి  ‘నా మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి’ అన్నారు.

అయితే ఇప్పుడు నయనతారకు ఎందుకు క్షమాపణ చెప్పాలి? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ‘ఎనక్కు ఇన్నోరు ముగమ్‌ ఇరుకు’ అనే షార్ట్ ఫిల్మ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను తప్పుగా మాట్లాడి ఉంటే నా మాటలను వెనక్కి తీసుకుంటానని గతంలో చెప్పాను. కానీ నేనెప్పుడూ ఎవ్వరికీ క్షమాపణలు చెప్పలేదు. అది నా రక్తంలోనే లేదు. అసలు నయనతారకు నేనెందుకు క్షమాపణలు చెప్పాలి? క్షమించరాని నేరం చేశానా?ఈ రోజు నేను మాట్లాడుతుంటే ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. ఆ రోజు నయనతార గురించి మాట్లాడినప్పుడు కూడా ఇదే విధంగా చప్పట్లు కొట్టి అభినందించారు. నేను నిజం మాట్లాడితే ప్రజలు నాకే మద్దతు పలుకుతారు. అయినా నేనెందుకు భయపడాలి? నేనిక సినిమాల్లో నటించేందుకు అవకాశం ఇచ్చేది లేదంటూ చాలా మంది బెదిరిస్తున్నారు. నన్నెవ్వరూ ఆపలేరు. సినిమాలు లేకపోతే నాటకాల్లో నటిస్తాను. అప్పుడేం చేస్తారు? అసలు ఇదో పెద్ద సమస్య అని నాకు అనిపించడంలేదు. ఇలాంటివన్నీ తాత్కాలికమే. నా మాటల్లో నిజం ఉంటే ఒప్పుకోండి. లేకపోతే వదిలేయండి’ అని మండిపడ్డారు రాధా రవి.

Latest Articles
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!