AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar Movie : ప్రభాస్ ‘సలార్’ సినిమా కథ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా ‘కె.జి.యఫ్’ దర్శక నిర్మాతలు ప్రశాంత్ నీల్, విజయ్ కిరగందూర్ ‘సలార్’ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై..

Salaar Movie : ప్రభాస్ 'సలార్' సినిమా కథ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్..
Rajeev Rayala
|

Updated on: Jan 22, 2021 | 5:38 AM

Share

Salaar Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా ‘కె.జి.యఫ్’ దర్శక నిర్మాతలు ప్రశాంత్ నీల్, విజయ్ కిరగందూర్ ‘సలార్’ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ప్రభాస్ ను ఎన్నడూ చూడని మాస్ లుక్ లో  చూపించనున్నాడు. సలార్ అని ముందే టైటిల్ ప్రకటించడంతో ఈ సినిమా పై అంచనాలు మాత్రం ఓ రేంజిలో నెలకొన్నాయి. సలార్ మూవీ రీమేక్ అంటూ పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్. ‘ఈ సినిమా ఏ సినిమాకు రీమేక్ కాదని అలాగే కేజీఎఫ్ సినిమా స్క్రిప్ట్ రాసే సమయంలో ఈ స్టోరీ కూడా రాసుకున్నామని’ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్. ‘ కథ ప్రకారం ఈ సినిమాలో హీరో అమాయకంగా ఉంటాడు.. ఆ తర్వాత పరిస్థితుల ప్రభావంతో వయోలెంట్ గా మారతాడు.  అందుకే ప్రభాస్ ను సెలెక్ట్ చేసుకున్నాం’ అని తెలిపాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sushant Singh Rajput : ఢిల్లీలోని రోడ్డుకు దివంగత నటుడి పేరు.. ‘సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మార్గ్ ‘ గా నామకరణం

Follow Us