WhatsApp: ఇక నుంచి వాట్సప్‌లోనే రీఛార్జ్ చేసుకోవచ్చు.. కొత్త ఆప్షన్ వచ్చేసింది.. సెకన్లలోనే ఈజీగా..
ఇక నుంచి రీఛార్జ్ చేసుకోవాలంటే యూపీఐ యాప్స్ లేదా టెలికాం కంపెనీల వెబ్‌సైట్లను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం వాట్సప్‌లోనే సులువుగా సెకన్లలోనే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ మేరకు వాట్సప్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్‌లో ఈ ఫీచర్ లాంచ్ చేసింది.

మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి ఇక నుంచి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. వాట్సప్‌లోనే ఇక నుంచి సులువుగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రీపెయిడ్ సిమ్ రీఛార్జులను చేసుకునే కొత్త ఫీచర్‌ను వాట్సప్ అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా.. ఇలా ఏ నెట్‌వర్క్ సిమ్ అయినా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పటికే స్కాన్ చేసి యూపీఐ పేమెంట్స్ చేయడం, ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం, ఇతరుల నుంచి డబ్బులు స్వీకరించడం లాంటి ఆప్షన్లను తీసుకొచ్చిన వాట్సప్.. ఇప్పుడు రీఛార్జ్ సౌకర్యాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఇప్పటికే మెట్రో టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో ఇప్పుడు రీఛార్జ్ ఆప్షన్ కూడా తీసుకొచ్చింది.
ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవచ్చు
రీచార్జ్ ఫీచర్ కోసం పేయూతో వాట్సప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్లు ఉపయోగించేవారితో పాటు ఐఓఎస్ వెర్షన్‌లో కూడా ఈ ఫీచర్ తీసుకొచ్చింది. ప్రస్తుతం కొంతమంది యూజర్లకు ఈ ఆప్షన్ అందుబాటులోకి రాగా.. రానున్న కొద్ది రోజుల్లో అందరికీ ఈ సౌకర్యం రానుంది. భారత్‌లోని యూజర్లందరూ త్వరలో ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చని మెటా ఇండియా డైరెక్టర్ రవి గార్గ్ తెలిపారు. దీంతో పాటు రూపీ సింబల్ హోమ్ స్క్రీన్‌లో కనిపించేలా కొత్త ఆప్షన్ తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇక నుంచి వాట్సప్ యూజర్లు రీఛార్జ్ కోసం ఇతర యాప్స్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదని, ఇక్కడ నుంచే చెల్లింపులు చేసి ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవచ్చని అన్నారు. సెకన్లలోనే పేమెంట్ చేసి ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. దీని సమయం ఆదా అవుతుందని, చాటింగ్ చేసుకుంటూనే రీఛార్జ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇక నుంచి రీఛార్జ్ చేసుకోవాలంటే ఇతర వెబ్‌సైట్లు, యాప్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదని అన్నారు.
రీఛార్జ్ ఎలా చేసుకోవాలి..?
-హోమ్ స్క్రీన్‌లో రూపీ సింబల్‌పై క్లిక్ చేయాలి
-మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి
-మీ ఫోన్ నెంబర్ లేదా మీరు ఎవరికైతే రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో వారి నెంబర్ ఎంటర్ చేయాలి
-మీ ఆపరేటర్‌ను ఎంచుకోవాలి
-మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవాలి
-యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయాలి
-వాట్సప్ యూపీఐతో అయినా పేమెంట్ చేయవచ్చు
-ఇక ఏదైనా యూపీఐ ఐడీతో అయినా చెల్లింపులు చేయవచ్చు
-చెల్లింపులు చేశాక మీ రీఛార్జ్ సక్సెస్ అని వస్తుంది
