AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: పిచ్చి మొక్క అనుకుంటే నిజంగా పిచ్చోళ్లే.. ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..

గుంటగలగరాకులో ఎన్నో పోషకాలు.. ఔషధ గుణాలు దాగున్నాయి.. బృంగరాజ్ ఆకు లేదా కాటుకాకు అని కూడా పిలువబడే ఈ గుంటగలగరాకు మొక్కతో పచ్చడి తయారుచేసుకుని తింటే.. పలు సమస్యలు దూరమవుతాయి.. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి, పేను కొరుకుడు వంటి సమస్యలను నివారిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

Health: పిచ్చి మొక్క అనుకుంటే నిజంగా పిచ్చోళ్లే.. ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
Guntagalagara Aaku Pachadi
Shaik Madar Saheb
|

Updated on: Apr 23, 2026 | 5:32 PM

Share

గుంటగలగరాకు పచ్చడి అనేది తెలుగువారి సంప్రదాయ వంటకాల్లో ఒకటి. దీనిని బృంగరాజ్ ఆకు లేదా కాటుకాకు అని కూడా పిలుస్తారు. ఈ ఆకు ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ప్రత్యేకించి, ఇది జుట్టు ఆరోగ్యం, కంటి చూపు మెరుగుదలకు ప్రసిద్ధి చెందింది. ఈ మొక్క పువ్వులు తెలుపు రంగులో ఉంటాయి. ఎండిన తర్వాత ఏర్పడే విత్తనాల నుండి సులభంగా ఇంట్లో కుండీలలో కూడా పెంచుకోవచ్చు. గుంటగలగరాకు ప్రధానంగా జుట్టు పెరుగుదలకు, నల్లబడటానికి సహాయపడుతుంది. దీని ఆకు రసాన్ని వెంట్రుకలకు వాడటం వల్ల జుట్టు నల్లగా, మృదువుగా, పొడవుగా పెరుగుతుంది. పేను కొరుకుడు వంటి సమస్యలు ఉన్నచోట ఈ రసాన్ని రాస్తే జుట్టు తిరిగి పెరుగుతుందని నమ్మకం. అంతేకాకుండా, ఈ ఆకు రక్త శుద్ధికి, కంటి చూపు మెరుగుదలకు చాలా మంచిది. కంటి సమస్యలకు దీనిని మించిన ఔషధ గుణాలున్న ఆకు మరొకటి లేదని నిపుణులు పేర్కొంటారు. తరచుగా ఈ పచ్చడిని తీసుకోవడం వల్ల చర్మ వ్యాధులు, తలనొప్పి, లివర్ సంబంధిత సమస్యలు, నోటి పుండ్లు వంటి వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. గాయాలను త్వరగా మాన్పడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా. కాలేయ ఆరోగ్యం, మెదడుకు బలానికి .. జ్ఞాపకశక్తిని పెంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

గుంటగలగరాకు (Bhringraj) ఆయుర్వేదంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక అద్భుతమైన మూలిక. దీని పచ్చడిని.. అమృతంగా పేర్కొంటారు.

గుంటగలగరాకు పచ్చడి తయారీ విధానం సులభం. ముందుగా స్టవ్ వెలిగించి, పాన్ లో కొద్దిగా నూనె వేసి మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి, ఆపై చింతపండు వేసి దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే పాన్ లో శుభ్రంగా కడిగిన గుంటగలగరాకు ఆకులను వేసి, మూతపెట్టి బాగా మగ్గించుకోవాలి. ఆకు కూరలు గోంగూర మగ్గినట్లే ఇది కూడా మగ్గుతుంది.

వేయించిన దినుసులు, మగ్గించిన గుంటగలగరాకు ఆకులను రోట్లో వేసి దంచడం వల్ల పచ్చడికి ప్రత్యేక రుచి వస్తుంది. మిక్సీలో వేసిన దానికంటే రోట్లో దంచిన పచ్చడి మరింత రుచికరంగా ఉంటుందని చెబుతారు. దంచేటప్పుడు, మిరపకాయ గింజలు, మినపప్పు, ధనియాలు కచ్చాపచ్చాగా ఉండి నోటికి తగులుతూ మంచి అనుభూతిని ఇస్తాయి. పచ్చడి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చేర్చి దంచుకోవచ్చు.

పచ్చడి సిద్ధమయ్యాక పోపు వేసుకోవాలి. స్టవ్ వెలిగించి, బాణలిలో నూనె వేడి చేసి, పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర), ఎండుమిర్చి, తరిగిన తెల్లగడ్డలు (వెల్లుల్లి), కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ వేయించిన పోపును సిద్ధంగా ఉన్న గుంటగలగరాకు పచ్చడిలో కలిపితే రుచికరమైన, ఆరోగ్యకరమైన గుంటగలగరాకు పచ్చడి సిద్ధం. వర్షాలు పడినప్పుడు ఈ ఆకు మాగాణి పొలాల గట్ల వెంబడి ఎక్కువగా లభిస్తుంది. ఈ పచ్చడిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక.. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలున్నా, సందేహాలున్నా.. నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.. 

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో
అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో
వారెవ్వా.. 90 కి.మీ మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ..
వారెవ్వా.. 90 కి.మీ మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ..
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే
పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే
అడ్డగోలుగా ఐపీఎల్ బెట్టింగ్స్.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్..
అడ్డగోలుగా ఐపీఎల్ బెట్టింగ్స్.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్..
చపాతీల్లోకి చిటికెలో చేసుకునే పల్లెటూరి చేతి పచ్చడి..
చపాతీల్లోకి చిటికెలో చేసుకునే పల్లెటూరి చేతి పచ్చడి..