Prakash Raj: విష్ణుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్‌ రాజ్‌.. పవన్‌ మార్నింగ్ షో కలెక్షన్ల అంత కాదంటూ..

Prakash Raj - Vishnu: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల హడావుడి సాధారణ ఎన్నికలను తలదన్నేలా కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వ్యవహారం హాట్‌ హాట్‌గా మారుతోంది...

Prakash Raj: విష్ణుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్‌ రాజ్‌.. పవన్‌ మార్నింగ్ షో కలెక్షన్ల అంత కాదంటూ..

Edited By: Ram Naramaneni

Updated on: Oct 02, 2021 | 3:29 PM

Prakash Raj – Vishnu: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల హడావుడి సాధారణ ఎన్నికలను తలదన్నేలా కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వ్యవహారం హాట్‌ హాట్‌గా మారుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యర్థులు చాలెంజ్‌లు విసురుకుంటూ ఎన్నికల వేడిని పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పోటీ నుంచి బండ్ల గణేశ్‌ తప్పుకోగా.. ఇప్పుడు పోటీ ఇటు ప్రకాశ్‌ రాజ్‌ విష్ణుల మధ్యే మారింది. ఇందులో భాగంగానే వీరిద్దరి మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా టీవీ9లో నిర్వహించిన ఫ్లాష్‌ పాయింట్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్‌ రాజ్‌ మంచు విష్ణుపై పలు సెన్సేషన్‌ కామెంట్స్‌ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ పేరును మా ఎన్నికల్లోకి లాగడంపై స్పందించిన ప్రకాశ్‌ రాజ్‌.. పవన్‌ గురించి మాట్లాడేప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని తెలిపారు. ప్రకాశ్‌ ఎటువైపు ఉన్నారు అని ప్రశ్నిస్తున్నారని.. మా ఎన్నికల్లోకి చిరంజీవి, కృష్ణ లాంటి పెద్ద వారిని ఎందుకు లాగుతున్నారని అసహనం వ్యక్తంచేశారు.

అంతేకాకుండా పవన్ కల్యాణ్ పేరును కూడా మా ఎన్నికల్లోకి లాగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన ప్రకాశ్ రాజ్..మీ సినిమాల మొత్తం బడ్జెట్ కలిపినా పవన్ కల్యాణ్ సినిమాల మార్నింగ్ షో కలెక్షన్స్ అంత ఉండదు. అలాంటిది మీరు ఆయన గురించి మాట్లాడటం ఏంటంటూ ప్రకాశ్‌ రాజ్‌ విమర్శించారు. మరి మా ఎన్నికలు పూర్తయ్యేలోపు ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

Also Read: Kurnool: నిర్లక్ష్యం నీడలో.. నిద్ర మత్తులో జోగుతోన్న క్రీడా ప్రాధికార సంస్థ.. క్రీడాకారులకు నరకం

EBC Nestham Scheme: అగ్రకుల మహిళలకు గుడ్ న్యూస్.. ఈబీసీ నేస్తం కోసం దరఖాస్తులకు ఆహ్వానం..

Annatthe: విడుదలకు సిద్ధమైన SP బాలు పాట.. అన్నాత్తే నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..