AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్న కోసమే.. ‘బాహుబలి’ చేశా

‘బాహాుబలి‘ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ సంపాదించుకుందో తెలిసిన విషయమే. అయితే.. ఈ సినిమా రెండు భాగాలు పూర్తయ్యే దాకా హీరో ప్రభాస్ వేరే ఏ ప్రాజెక్ట్ చేయకపోవడం అప్పట్లో ఓ సంచలనంగా మారింది. కాగా.. ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా సమయాన్నే కేటాయించాడు. అయితే.. భారీ రెమ్యునరేషన్ కారణంగానే ప్రభాస్ ఈ సినిమాకి అంత టైం కేటాయించాడనే టాక్ వినిపించేది. అయితే అసలు ఈ ప్రాజెక్ట్ తాను చేయడానికి కారణం తన తండ్రి సూర్య […]

నాన్న కోసమే.. ‘బాహుబలి’ చేశా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 01, 2020 | 7:58 PM

Share

‘బాహాుబలి‘ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ సంపాదించుకుందో తెలిసిన విషయమే. అయితే.. ఈ సినిమా రెండు భాగాలు పూర్తయ్యే దాకా హీరో ప్రభాస్ వేరే ఏ ప్రాజెక్ట్ చేయకపోవడం అప్పట్లో ఓ సంచలనంగా మారింది. కాగా.. ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా సమయాన్నే కేటాయించాడు. అయితే.. భారీ రెమ్యునరేషన్ కారణంగానే ప్రభాస్ ఈ సినిమాకి అంత టైం కేటాయించాడనే టాక్ వినిపించేది. అయితే అసలు ఈ ప్రాజెక్ట్ తాను చేయడానికి కారణం తన తండ్రి సూర్య నారాయణ రాజు అని తాజా ఇంటర్య్వూలో ప్రభాస్ చెప్పాడు. తనని వెండితెరపై ఒక రాజులా చూడాలనే కోరిక తన తండ్రికి ఉండేదనీ, అందువలనే రాజుల నేపథ్యంలో సాగే ఈ సినిమాకి ఒకే చెప్పానని తెలిపాడు ప్రభాస్. అలా ఈ సినిమా చేసి విజయాన్ని అందుకుని నాన్న కోరిక నెరవేర్చానని చెప్పుకొచ్చాడు.