భర్తతో పాటు పూనమ్‌కి బెయిల్ మంజూరు
గోవాలో పవిత్రమైన చాపోలీ డ్యామ్ వద్ద అసభ్యకర సన్నివేశాలు తెరకెక్కించిన కేసులో బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే, ఆమె భర్త శామ్ బొంబాయ్ అరెస్టైన విషయం తెలిసిందే

Poonam gets bail: గోవాలో పవిత్రమైన చాపోలీ డ్యామ్ వద్ద అసభ్యకర సన్నివేశాలు తెరకెక్కించిన కేసులో బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే, ఆమె భర్త శామ్ బొంబాయ్ అరెస్టైన విషయం తెలిసిందే. ఆ కపుల్‌కి అరెస్టైన రోజే బెయిల్ వచ్చింది. ఒక్కొక్కరు రూ.20వేల రూపాయల పూచీకత్తును కట్టి బెయిల్ తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా కనాకోనాలోని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆ ఇద్దరికి పలు షరతులను విధించింది. కోర్టు పర్మిషన్ లేకుండా గోవాను విడిచి వెళ్లొద్దని, ఆరు రోజుల పాటు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి రిపోర్ట్ చేయాలని సూచించింది. కాగా పూనమ్ అసభ్యకర వీడియో షూటింగ్‌పై సర్వత్రా విమర్శలు వినిపించాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు, గోవా ప్రతిపక్ష నేతల డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
Read More:
మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండండి: డబ్ల్యూహెచ్‌ఓ