లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఆంటో జోసెఫ్, లిస్టిన్ స్టీఫెన్ సహా తొమ్మిది మందిపై కేసు
తాజాగా ఓ మహిళా నిర్మాత ఫిర్యాదు మేరకు పోలీసులు 9 మంది నిర్మాతల సంఘం ఆఫీస్ బేరర్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రముఖ నిర్మాతలు ఆంటో జోసెఫ్, లిస్టిన్ స్టీఫెన్ ఇతరుల పేర్లు కూడా ఉన్నాయి. తనను అసోసియేషన్ సమావేశానికి పిలిచి దారుణంగా ప్రవర్తించారని, తన స్త్రీత్వాన్ని కించపరిచారని మహిళా నిర్మాత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటికే హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీల పై కూడా గట్టి ప్రభావం చూపుతోంది. చాలా మంది మహిళలు బయటకు వచ్చి తమకు ఎదురైనా చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. తాజాగా ఓ మహిళా నిర్మాత ఫిర్యాదు మేరకు పోలీసులు 9 మంది నిర్మాతల సంఘం ఆఫీస్ బేరర్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రముఖ నిర్మాతలు ఆంటో జోసెఫ్, లిస్టిన్ స్టీఫెన్ ఇతరుల పేర్లు కూడా ఉన్నాయి. తనను అసోసియేషన్ సమావేశానికి పిలిచి దారుణంగా ప్రవర్తించారని, తన స్త్రీత్వాన్ని కించపరిచారని మహిళా నిర్మాత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత, కేసులను దర్యాప్తు చేసే ప్రత్యేక దర్యాప్తు బృందాని ఏర్పాటు చేశాడు. ఆ బృందానికి మహిళా నిర్మాత ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాను నిర్మించిన కొన్ని సినిమాలకు సంబంధించి అసోసియేషన్‌తో కొన్ని వివాదాలు ఉన్నాయని, ఇదే విషయమై మాట్లాడేందుకు అసోసియేషన్ అధికారులు తనను సమావేశానికి పిలిచారని నిర్మాత ఫిర్యాదు చేశారు. ఆతర్వాత తనతో తప్పుగా ప్రవర్తించారని ఆమె పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మహిళా నిర్మాత సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసింది. దీని తర్వాత, ప్రకటనపై స్పందించి వివరణ ఇవ్వాలని కోరుతూ అసోసియేషన్ నిర్మాతకు లేఖ పంపింది. ఈ లేఖ అందడంతో మహిళా నిర్మాత వివరణ ఇచ్చేందుకు సమావేశానికి వచ్చారు. సమావేశంలో సంఘం అధికారులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే నిర్మాత మిను మునీర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీనా ఆంటోనీ అన్నారు. సోషల్ మీడియా ద్వారా పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారనే కారణంతో ఈ చర్య తీసుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.