Narendra Modi : కశ్మీరీ పండిట్ల మీద జరిగిన హత్యాకాండ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ చిత్రయూనిట్‌ను అభినందించారు. దర్శకుడు వివేక్ అగ్రిహోత్రి, నిర్మాతలు పల్లవి జోషి, అభిషేక్ అగర్వాల్ ప్రధానిని కలిసిన వాళ్లలో ఉన్నారు. వారి పై మోడీ ప్రశంసలు కురిపించారు. తాజాగా మరోసారి ప్రధాని ఈ మూవీ గురించి మాట్లాడారు. “ది కాశ్మీర్ ఫైల్స్” చాలా మంచి సినిమా. మీరందరూ చూడాలి. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి” అని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం నాడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన వారందరినీ కొత్తగా విడుదల చేసిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఇది చాలా మంచి సినిమా అని, ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆయన అన్నారు.
వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాశ్మీరీ పండిట్ల బాధను చూపించారు. మరో వైపు సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమాపై విపరీతమైన ప్రశంసలు రావడంతో జనాల్లో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఇక ప్రధాని సైతం ఈ సినిమా పై పొగడ్తలు కురిపించడంతో ప్రజల్లో ఈ మూవీ పై ఆసక్తి పెరిగింది. “ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా సరికొత్త రికార్డులు, చరిత్ర సృష్టిస్తోంది. తొలిరోజు దేశవ్యాప్తంగా 600 స్క్రీన్లు మాత్రమే వచ్చాయి. కానీ, ఆదివారం నాటికి సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న మక్కువ చూసి స్క్రీన్ కౌంట్ 600 నుంచి 2000కి పెరిగింది. సినిమా షోలు కూడా ప్రతి నగరంలో రెట్టింపు అయ్యాయి. పెద్ద స్టార్లు లేకుండా దాదాపు 12 కోట్ల రూపాయలతో 27 కోట్లకు పైగా బిజినెస్ చేసింది ‘ది కాశ్మీర్ ఫైల్స్’.
जो लोग Freedom Of Expression के झंडे लेकर घूमते हैं वो पूरी जमात पिछले 5-6 दिनों से बौखलाई हुई है
जो सत्य है उसे सही स्वरूप में दुनिया के सामने लाना देश की भलाई के लिए होता है : PM @narendramodi जी#TheKashmirFiles pic.twitter.com/5kfw7M8rck
— RajyavardhanRathore (@Ra_THORe) March 15, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :