‘మిస్టర్ బీన్’గా ఒత్తిడికి గురయ్యా: రోవన్
మిస్టర్ బీన్.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ కారెక్టర్‌ని పిల్లలే కాదు పెద్దవాళ్లు కూడా బాగా ఇష్టపడుతారు.

Rowan Atkinson Mr. Bean: మిస్టర్ బీన్.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ కారెక్టర్‌ని పిల్లలే కాదు పెద్దవాళ్లు కూడా బాగా ఇష్టపడుతారు. ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు చాలా మంది ఇతడి షోలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. మాటలు లేకుండా ఓ చిన్న బొమ్మను పట్టుకొని, సపరేట్‌గా తయారు చేసిన కారుతో ఆ పాత్రలో రోవన్ అట్కిన్‌సన్ చేసే అల్లరి ఏ వర్గం వారినైనా తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఈ అమెరికన్ కామెడీ షో ప్రారంభించి 30 ఏళ్లు అవుతుండగా.. ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ పాత్ర గురించి మిస్టర్ బీన్ మాట్లాడుతూ.. అందులో నటించేటప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యవాడినని అన్నారు.
”మిస్టర్ బీన్ కచ్చితంగా విజయవంతం అవుతుందని, ఎక్కువ రోజులు సాగుతుందని నాకు మొదటి నుంచి నమ్మకం ఉండేది. ఆ పాత్రలో చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది. అందుకే చాలామంది ఆ పాత్ర నచ్చి అభిమానులు అయ్యారు. అయితే దీనికి షూటింగ్ చేసేటప్పుడు చాలా ఒత్తిడిని ఎదుర్కొనేవాడిని. కానీ ఈ పాత్రకు ఉన్న బాధ్యత వలన ఫన్నీగా చేసేవాడిని. ఒక్కోసారి జోకులు పేలినా, పేలకపోయినా నా మీద ప్రభావం ఉండేది. అది కాస్త ఒత్తిడిగా అనిపించేది” అని అన్నారు. ఇక షూటింగ్ అయిపోయిన తరువాత ప్రేక్షకుల ఆదరణ నాకు చాలా సంతోషానిచ్చేది అని రోవన్ తెలిపారు.
Read More: