AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ రెమ్యునరేషన్ డిమాండ్‌ చేస్తోన్న సాయి పల్లవి..!

సహజ నటుడు నాని, సాయి పల్లవి మరోసారి జోడీ కట్టబోతున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్

భారీ రెమ్యునరేషన్ డిమాండ్‌ చేస్తోన్న సాయి పల్లవి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 16, 2020 | 4:14 PM

Share

Sai Pallavi remuneration: సహజ నటుడు నాని, సాయి పల్లవి మరోసారి జోడీ కట్టబోతున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న శ్యామ్ సింగ రాయ్‌ కోసం దర్శకుడు సాయి పల్లవిని సంప్రదించారని, కథ నచ్చడంతో వెంటనే మలార్ బ్యూటీ ఒప్పుకుందని టాక్ నడిచింది. అంతేకాదు ఇందులో సాయి పల్లవి నెగిటివ్ టచ్‌ ఉన్న పాత్రలో నటించబోతున్నట్లు కూడా గాసిప్‌లు వినిపించాయి.

ఇదిలా ఉంటే ఈ మూవీకి ఓకే చెప్పిన సాయి పల్లవి, రెమ్యునరేషన్ విషయంలో మాత్రం భారీ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రూ.2కోట్లు కావాలని సాయి పల్లవి, నిర్మాతలకు చెప్పినట్లు టాక్. ఈ నేపథ్యంలో ఈ విషయంలో ప్రస్తుతం సాయి పల్లవితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరి రెమ్యునరేషన్ విషయంలో సాయి పల్లవి కాంప్రమైజ్ అవుతుందా..? లేక రెమ్యునరేషన్ కోసం సినిమా వదులకుంటుందా..? అసలు ఇందులో నిజమెంత..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

కాగా ప్రస్తుతం సాయి పల్లవి, రానా సరసన విరాట పర్వం.. నాగ చైతన్య సరసన లవ్ స్టోరీలో నటిస్తోంది. చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కబోయే వేదాళం రీమేక్‌లో అతడి చెల్లెలి పాత్ర కోసం ఈ బ్యూటీని సంప్రదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read More:

‘మిస్టర్ బీన్’‌గా ఒత్తిడికి గురయ్యా: రోవన్‌

నూతన్ నాయుడుకి షాక్‌.. బెయిల్‌ నిరాకరణ

Follow Us