Breaking News
  • అమరావతి: సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ. గాయకుడు ఎస్ పి బాల సుబ్రమణ్యం స్మృత్యర్ధం నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం నెలకొల్పాలి. కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి. కళాక్షేత్రం అభివృద్ది-ప్రతి ఏటా రాష్ట్ర పండుగగా జయంతి, జాతీయ పురస్కారం ఏర్పాటు చేయాలి. లలిత కళలకు ప్రోత్సాహం ఇవ్వాలని లేఖలో కోరిన చంద్రబాబు.
  • హేమంత్ హత్య కేసులో మరో ట్విస్ట్ . హేమంత్ కేసులో మరో ఇద్దరు ప్రమేయం ఉన్నట్లు ఆరోపిస్తున్న అవంతి. సందీప్ రెడ్డి గూడూరు, ఆశిష్ రెడ్డి ప్రమేయం కూడా ఉందంటున్న అవంతి . గతంలో హేమంత్ తండ్రితో బెదిరింపులకు దిగిన సందీప్ రెడ్డి . నాతో రెండు లక్షలు డబ్బులు తీసుకున్నాడు అంటూ నెల రోజులు క్రితం బెదిరింపులు . హేమంత్ కిడ్నాప్ అయిన రోజు సందీప్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్న గచ్చి బౌలి పోలీసులు . సందీప్ రెడ్డి నుండి నాకు ప్రాణ హాని ఉందంటున్న అవంతి.
  • చెన్నై : ఎస్పీబీ మెమోరియల్ ఫై స్పందించిన ఎస్పీ చరణ్ . నాన్నగారి అభిమానులకోసం అయన స్మారకమందిరాన్ని తప్పకుండ నిర్మిస్తాము . అయన ఎంతో ఇష్టపడే అయన ఫార్మ్ హౌస్లోనే మా సొంత ఖర్చులతో నిర్మిస్తాము . తెలుగు, తమిళ భాషలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న నాన్నగారి అభిమానులు ఆయన్ని స్మరించుకునేలా , ప్రజలు అందరూ వచ్చి సందర్శించేలా ఏర్పాటు చేస్తాము .
  • తండ్రిని చంపి పాతిపెట్టిన కొడుకు సహకరించిన తల్లి. కన్నకొడుకే తండ్రిని కిరాతకంగా అంతమొందించిన ఘటన . చేవెళ్ల‌ గుండాల గ్రామంలో ఘటన .   నెలరోజులుగా తండ్రి కనిపించకపోవడంతో బంధువులు కొడుకుని గట్టిగా నిలదీయడంగ అసలు విషయం బట్టబయలు . నెల రోజులుగా కనిపించకుండా పోయిన కిష్టయ్య. తల్లితో కలసి తండ్రిని చంపేశానని ,తమ పొలంలోనే పాతిపెట్టినట్లు అంగీకరించిన కొడుకు . మృతదేహం బయటికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.
  • వివాదాస్పద 3 రైతు బిల్లలకు రాష్ట్రపతి ఆమోదముద్ర. గెజిట్ నోటిఫికేషన్ విడుదల. నేటి నుంచి చట్టరూపం సంతరించుకున్న బిల్లులు.
  • తూర్పు బీహార్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం. ఈశాన్య జార్ఖండ్‌, ఒడిశా మీదుగా మరో ఉపరితల ద్రోణి. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు. నేడు, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు-వాతావరణశాఖ.
  • మాజీ కేంద్ర మంత్రి శ్రీ జస్వంత్ సింగ్ అకాల మృతి పట్ల సంతాపం తెలియ చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్. శ్రీ అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ, ఆర్ధిక శాఖ మంత్రిగా పని చేసిన శ్రీ జస్వంత్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని గవర్నర్ శ్రీ హరిచందన్ తెలిపారు. శ్రీ జస్వంత్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

నూతన్ నాయుడుకి షాక్‌.. బెయిల్‌ నిరాకరణ

శిరోముండనం కేసులో నూతన్ నాయుడుకు మరో షాక్ తగిలింది. ఆయన బెయిల్‌ని ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది

Nutan Naidu Bail, నూతన్ నాయుడుకి షాక్‌.. బెయిల్‌ నిరాకరణ

Nutan Naidu Bail: శిరోముండనం కేసులో నూతన్ నాయుడుకు మరో షాక్ తగిలింది. ఆయన బెయిల్‌ని ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో నూతన్ నాయుడు, ఆయన భార్య ప్రియ మాధురి సహా మరో ఆరుగురు ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలాది శ్రీనివాస్ వాదనలు వినిపించారు. కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని ఆయన చెప్పగా.. దాంతో ఏకీభవించిన జడ్జీ వెంకట నాగేశ్వరరావు బెయిల్ పిటిషన్‌ని తోసిపుచ్చారు.

ఇదిలా ఉంటే విచారణలో భాగంగా శ్రీకాంత్‌కి శిరోముండనం చేయమని తాను చెప్పలేదని నూతన్‌ నాయుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్‌ పేరును చెప్పలేదని, అలా చెప్పి పనులు చేయించుకునే శక్తి తనకు లేదని పోలీసుల దగ్గర నూతన్ నాయుడు వెల్లడించినట్లు సమాచారం. అయితే సెల్‌ఫోన్ దొంగలించాడన్న నెపంతో తమ దగ్గర పనిచేసి మానేసిన ఓ దళిత యువకుడికి నూతన్ నాయుడు భార్య గుండు చేయించింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

Read More:

ట్రాన్స్‌జెండర్ల కోసం జగన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం

చిరంజీవి కోరిక.. మార్పులు చేస్తోన్న కొరటాల..!

Related Tags