Amitabh Bachchan : అమితాబ్ వాయిస్‌ను తొలగించండి.. కోర్టును ఆశ్రయించిన సామాన్యుడు

|

Jan 08, 2021 | 12:05 PM

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ పై కోర్టులో పిటీషన్ దాఖలు అయ్యాయంది. కేసు వేసింది ఓ సామాన్యుడు.. అసలు విషయం ఏంటంటే.. ఈ మధ్య మన ఫోన్ లలో కరోనా పట్ల అప్రమత్తంగా ఉండమంటూ..

Amitabh Bachchan : అమితాబ్ వాయిస్‌ను తొలగించండి.. కోర్టును ఆశ్రయించిన సామాన్యుడు
Amitabh Bachan
Follow us on

Amitabh Bachchan : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ పై కోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది.ఈ పిటీషన్ దాఖలు చేసింది ఓ సామాన్యుడు.. అసలు విషయం ఏంటంటే.. ఈ మధ్య మన ఫోన్ లలో కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండమంటూ కలర్ ట్యూన్ వినిపిస్తూ ఉంటుంది. హిందీలో ఆ వాయిస్ అమితాబ్ అందించారు. అయితే అమితాబ్ బచ్చన్ వాయిస్ ను తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు ఓ వ్యక్తి.

కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పే కొద్ది వాయిస్ కు ఆయన డబ్బులు తీసుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నాడు. అలాంటప్పుడు ఆయన వాయిస్ ను తీసుకోవాల్సిన అవసరం లేదని అతడు కోర్టును కోరాడు. అంతే కాదు అమితాబ్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. అలాంటప్పుడు అతను ఎలా జాగ్రత్తలు చెప్తాడు అంటూ పిటీషన్ లో పేర్కొన్నాడు. కరోనా నియంత్రించడానికి కృషి చేసిన ఎంతో మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారని వారితో వాయిస్ చేయించాలని, ఉచితంగా తమ వాయిస్ ను అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. వారి వాయిస్ తో కలర్ ట్యూన్ ను పెట్టాలని అమితాబ్ వాయిస్ ను వెంటనే తొలగించాలని అతడు కోరాడు. దీని పై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Indian Army: సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన భారత సైన్యం.. విద్యార్థులకు ఉచితంగా..

F3 Movie Updates: సంక్రాంతి అల్లుళ్లకు ఈసారి నో హాలిడేస్.. పండుగ పూట కూడా సెట్‌లోనే.. అనిల్ అల్టిమేటం !‌