గజదొంగ బయోపిక్‌లో పాయల్
‘ఆర్‌ఎక్స్ 100’తో టాలీవుడ్‌కు పరిచయమై కుర్రకారును ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఐదు చిత్రాల్లో నటిస్తోన్న ఈ బ్యూటీకి తాజాగా మరో ఆఫర్ వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిస్తోన్న ఓ చిత్రంలో పాయల్ హీరోయిన్‌గా ఎన్నికైంది. 1980-90లలో స్టూవర్టుపురం గజదొంగగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దొంగతనం చేయడంలో మంచి నేర్పరి అయిన నాగేశ్వరరావు, పోలీసులను బురిడీ కొట్టించేవాడు. ఇక ఈ […]
‘ఆర్‌ఎక్స్ 100’తో టాలీవుడ్‌కు పరిచయమై కుర్రకారును ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఐదు చిత్రాల్లో నటిస్తోన్న ఈ బ్యూటీకి తాజాగా మరో ఆఫర్ వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిస్తోన్న ఓ చిత్రంలో పాయల్ హీరోయిన్‌గా ఎన్నికైంది.
1980-90లలో స్టూవర్టుపురం గజదొంగగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దొంగతనం చేయడంలో మంచి నేర్పరి అయిన నాగేశ్వరరావు, పోలీసులను బురిడీ కొట్టించేవాడు. ఇక ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. బుర్రా సాయి మాధవ్ సంభాషణలు సమకూరుస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.