AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangalavaram: మంగళవారం వచ్చేదెన్నడు.? పాయల్‌ కొత్త సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్‌

ఆర్‌ఎక్స్‌ 100 తర్వాత అటు దర్శకుడు అజయ్‌ భూపతికి కానీ, ఇటు పాయల్‌ రాజ్‌పుత్‌కు కానీ మళ్లీ ఆ స్థాయి విజయం దక్కలేదని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ లేటెస్ట్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మంగళవారం పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహాసముద్రం వంటి భారీ డిజాస్టర్‌ తర్వాత అజయ్‌ భూపతి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు...

Mangalavaram: మంగళవారం వచ్చేదెన్నడు.? పాయల్‌ కొత్త సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్‌
Mangalavaram Movie
Narender Vaitla
|

Updated on: Sep 25, 2023 | 4:22 PM

Share

ఆర్‌ఎక్స్‌ 100 ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుందీ మూవీ. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను రాబట్టిందీ సినిమా. అజయ్‌ భూపతి దర్శకుడిగా తెరకెక్కించిన తొలి సినిమాతోనే ఊహించని విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇదే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసిందీ బ్యూటీ. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో మరో చిత్రం వస్తోంది.

నిజంగా చెప్పాలంటే ఆర్‌ఎక్స్‌ 100 తర్వాత అటు దర్శకుడు అజయ్‌ భూపతికి కానీ, ఇటు పాయల్‌ రాజ్‌పుత్‌కు కానీ మళ్లీ ఆ స్థాయి విజయం దక్కలేదని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ లేటెస్ట్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మంగళవారం పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహాసముద్రం వంటి భారీ డిజాస్టర్‌ తర్వాత అజయ్‌ భూపతి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం తన ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మంగళవారం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇక మంగళవారం సినిమాకు సంబంధించి ఒకే ఒక పోస్టర్‌తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాడు దర్శకుడు అజయ్‌ భూపతి. పాయల్ బోల్డ్‌ లుక్‌లో కనిపించిన ఈ పోస్టర్‌ చిత్రంపై క్యూరియాసిటీని పెంచేసింది. ఇక టీజర్‌ చిత్రంపై మరిన్ని అంచనాలు పెంచేసింది. సినిమాపై పాజిటివ్‌ బజ్‌కు కారణమైంది. ఇక ఈ సినిమా ఇంకెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ సోమవారం ఓ అప్‌డేట్ ఇచ్చింది.

మంగళవారం సినిమా విడుదల తేదీని రేపు ఉదయం (మంగళవారం) 10.30 గంటలకు ప్రకటించనున్నట్లు తెలిపింది. మంగళవారం సినిమా విడుదల తేదీని మంగళవారం ప్రకటిస్తుండడం విశేషం. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా పాయల్‌ నటిస్తుండగా.. నందిత శ్వేత, కృష్ణ చైతన్య, అజయ్‌ ఘెష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. మరి ఈ సినిమాతోనైనా పాయల్‌, అజయ్‌ ఫేట్ మారుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..