టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ మల్టీస్టారర్.. పవన్-రానా కాంబినేషన్‏లో సినిమా.. ఇంతకీ టైటిల్ అదేనా?

లాక్‏డౌన్ అనంతరం ఇటీవల సినిమా షూటింగ్‏లు తిరిగి ప్రారంభమయ్యాయి. తాజాగా టాలీవుడ్‏లో మరో క్రేజీ మల్టీస్టారర్ రాబోతుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్,

  • Rajitha Chanti
  • Publish Date - 3:19 pm, Tue, 22 December 20
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ మల్టీస్టారర్.. పవన్-రానా కాంబినేషన్‏లో సినిమా.. ఇంతకీ టైటిల్ అదేనా?

లాక్‏డౌన్ అనంతరం ఇటీవల సినిమా షూటింగ్‏లు తిరిగి ప్రారంభమయ్యాయి. తాజాగా టాలీవుడ్‏లో మరో క్రేజీ మల్టీస్టారర్ రాబోతుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హీరో దగ్గుబాటి రానా కలిసి నటించనున్నారు. మలయాళం మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్-రానా కలిసి నటించనుండగా.. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది.

ఇక వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమాకు టైటిల్ ఎంటీ ? అనేది ప్రస్తుతం అందిరిలో ఉన్న సందేహం. అయితే ఈ సినిమాకు ‘బిల్లా-రంగా’ అనే టైటిల్ పెట్టాలని యోచిస్తోందట చిత్రయూనిట్. పవన్-రానా కలిసి మొదటిసారి తెర మీద సందడి చేయబోతున్నారు. ఈ సినిమాకు బిల్లా-రంగా అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని చిత్రయూనిట్ భావిస్తోందని సమాచారం. కాగా అప్పట్లో చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన సినిమా కూడా ఇదే టైటిల్‏తో విడుదలైంది. మరీ నిజాంగానే ఈ సినిమా టైటిల్ ఇదేనా? లేదా అనే విషయాం తెలియాల్సి ఉంది. కాగా పవన్ నటిస్తున్న ఈ సినిమాకు సాగర్ కె.చంద్ర తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుంది.