Mushroom Toast: స్టార్ హీరోయిన్ చేసిన ‘మష్రూమ్ టోస్ట్’! చూస్తుంటేనే నోరూరుతుంది
సెలబ్రిటీల వంటకాలు ఎప్పుడూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటాయి, కానీ అవి సింపుల్‌గా, ఇంట్లో సులభంగా చేసేటట్టు ఉంటే మరింత ఎక్సైటింగ్. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నది బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా చేసే 'మష్రూమ్ టోస్ట్'! ఆమె భర్త, రాజ్యసభ ఎంపీ రాఘవ్ ..

సెలబ్రిటీల వంటకాలు ఎప్పుడూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటాయి, కానీ అవి సింపుల్‌గా, ఇంట్లో సులభంగా చేసేటట్టు ఉంటే మరింత ఎక్సైటింగ్. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నది బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా చేసే ‘మష్రూమ్ టోస్ట్’! ఆమె భర్త, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల షేర్ చేసిన ఈ రెసిపీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వైట్ సాస్‌తో మిక్స్ చేసిన మష్రూమ్ మిక్స్‌ను టోస్ట్ మీద పూసి సర్వ్ చేసే ఈ డిష్ బ్రెక్‌ఫాస్ట్‌కి లేదా స్నాక్‌కి పర్ఫెక్ట్. ఈ రెసిపీ వెనుక ఉన్న కథ, తయారీ విధానం తెలుసుకుందాం..
స్పెషల్ రెసిపీ..
పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఇటీవల తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఈ సంతోషకరమైన సమయంలోనే ‘కర్లీ టేల్స్’ యూట్యూబ్ ఛానల్‌లోని ‘తేరే గల్లీ మే’ ఎపిసోడ్‌లో రాఘవ్ కమియా జానీతో కలిసి కనిపించారు. ఢిల్లీలోని వారి అందమైన ఇల్లు, పచ్చదనం, ఆర్ట్ పీసెస్‌తో అలంకరించిన విశాలమైన గార్డెన్‌ను ప్రేక్షకులకు చూపించారు. ఈ ఎపిసోడ్‌లో పంజాబీ బ్రెక్‌ఫాస్ట్ గోబి పరాటా, బీట్‌రూట్ ధోక్లా, అవకాడో సర్వ్ చేస్తూ, పరిణీతి స్పెషల్ ‘మష్రూమ్ టోస్ట్’ రుచి చూపించారు.
రాఘవ్ మొదట ఈ డిష్ రెసిపీ గెస్ చేయడానికి ట్రై చేశారు, కానీ కన్ఫ్యూజ్ అయి… పరిణీతికి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నారు! ఈ క్యూట్ మూమెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాఘవ్ చెప్పినట్టు, ఈ టోస్ట్ పరిణీతి ‘సిగ్నేచర్’ డిష్ సింపుల్ ఇంగ్రేడియెంట్స్‌తో రుచికరంగా తయారవుతుంది.

Parineeti N Richa Chaddaa
ఈ రెసిపీ వీడియో కర్లీ టేల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయ్యాక, లైక్స్, కామెంట్స్‌తో మోతమోగిపోతోంది. ‘బ్యూటిఫుల్, డెఫినిట్లీ ట్రై చేస్తాను!’ అని ఒకరు. ‘థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆసమ్ రెసిపీ’ అంటూ మరొకరు. చాలామంది ‘పరిణీతి స్టైల్‌లో ఇంట్లో చేసి చూశాం – సూపర్ యమ్మీ!’ అని కామెంట్ చేశారు. ఈ సింపుల్ రెసిపీ వల్ల పరిణీతి, రాఘవ్ కపుల్ సోషల్ మీడయాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. మీరూ ట్రై చేస్తారా.
వీడియో చూడండి..
View this post on Instagram
కావాల్సిన పదార్థాలు
- మష్రూమ్స్: 200 గ్రాములు (స్లైస్ చేసినవి)
- బటర్: 2 టేబుల్ స్పూన్లు
- మైదా (ఆల్-పర్పస్ ఫ్లోర్): 2 టేబుల్ స్పూన్లు
- పాలు: 1 కప్పు
- చీజ్: ½ కప్పు (గ్రేటెడ్, మోజారెల్లా లేదా చెద్దార్)
- ఉప్పు, మిరియాలు: రుచికి తగినంత
- బ్రెడ్ స్లైసెస్: 4–6 (టోస్ట్ చేయడానికి)
- ఆప్షనల్: గార్లిక్ పౌడర్, హెర్బ్స్ (ఓరెగానో లేదా పార్స్లీ) కొంచెం
తయారీ విధానం
పాన్‌లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేడి చేయండి. మైదా జోడించి 1–2 నిమిషాలు కలపండి. నెమ్మదిగా పాలు పోసి కలపండి. గట్టిపడకుండా క్రీమీగా మారే వరకు కలపండి (3–4 నిమిషాలు). ఉప్పు, మిరియాలు, గార్లిక్ పౌడర్ జోడించండి. మరో పాన్‌లో మిగిలిన బటర్ వేడి చేసి మష్రూమ్ స్లైసెస్ ఫ్రై చేయండి (2–3 నిమిషాలు, గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు). వైట్ సాస్‌లోకి జోడించి మిక్స్ చేయండి. చీజ్ గ్రేటింగ్ పైన పూసి, మెల్ట్ అయ్యే వరకు కలపండి. బ్రెడ్ స్లైసెస్‌ను టోస్ట్ చేయండి. మష్రూమ్ మిక్స్‌ను రాసి, ఎక్స్‌ట్రా చీజ్ స్ప్రింకిల్ చేసి ఓవెన్‌లో 2 నిమిషాలు బేక్ చేసి హాట్‌గా సర్వ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ పరిణితీ చోప్రా సిగ్నేచర్ డిష్ మష్రూమ్ టోస్ట్ ట్రై చేసి టేస్ట్ చేయండి!




