OTT Movie: ఒళ్లు గగుర్పొడిచే జాంబీ థ్రిల్లర్.. రిలీజ్‌డే నుంచే టాప్‌లో ట్రెండింగ్‌.. పిల్లలతో అసలు చూడొద్దు

జాంబీ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓ ప్రమాదకర వైరస్‌ కారణంగా మనిషిని మరో మనిషి కిరాతకంగా చంపి తినడం, వాటి నుంచి తప్పించుకునేందుకు హీరో, హీరోయిన్ల పోరాటం పోరాటం కాన్సెప్ట్ తో ఇప్పటిదాకా ఎన్నో జాంబి థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమా జాంబీ మూవీస్ లో నెక్ట్స్ లెవెల్.

OTT Movie: ఒళ్లు గగుర్పొడిచే జాంబీ థ్రిల్లర్.. రిలీజ్‌డే నుంచే టాప్‌లో ట్రెండింగ్‌.. పిల్లలతో అసలు చూడొద్దు
OTT Movie

Updated on: Jul 13, 2025 | 7:17 PM

ఎప్పటిలాగే గత శుక్రవారం కూడా ఎన్నో కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చాయి. తెలుగులో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఇందులో ఒక సినిమా మాత్రం ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోది. గత శక్రవారం ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ గత మూడు రోజులుగా టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లిపోతోంది. ఇదొక జాంబీ హారర్ థ్రిల్లర్ సినిమా పేరే జియామ్. థాయ్ ల్యాండ్ నేపథ్యంగా సాగే ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీన్స్, రక్తపాతం, హారిబుల్ సీన్స్ చాలానే ఉన్నాయి. అందుకే ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా కథ విషయానికి వస్తే.. ఆహార కొరత దేశాన్ని అతలా కుతలం చేస్తుంది. పర్యావరణ విపత్తులు ప్రజలను అస్తవ్యస్తం చేస్తాయి. అక్కడ సింగ్ అనే మాజీ ఫైటర్ డెలివరీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తుంటాడు. అతని ప్రియురాలు రిన్ ప్రచమిత్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పని చేస్తుంది. అయితే ధృవాల్లో కరిగిన మంచు నుంచి విడుదలైన ఒక ప్రమాదకరమైన వైరస్ అంతటా వ్యాపిస్తుంది. అది మనుషులను కిరాతకమైన జాంబీలుగా మారుస్తుంది.

ఈ విషయం తెలుసుకున్న సింగ్ తన ప్రియురాలిని కాపాడుకునేందుకు ఆస్పత్రిలో ప్రవేశిస్తాడు. అప్పటి నుంచే సింగ్, జాంబీల మధ్య పోరాటం మొదలవుతుంది. అదే సమయంలో ప్రభుత్వం పెద్ద పెద్ద బాంబులతో జాంబీలు ఉన్న ఆస్పత్రిని నాశనం చేయడానికి రెడీ అవుతుంది. మరి జాంబీల నుంచి హీరో, హీరోయిన్లు బయట పడ్డారా? చివరికి ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ జాంబీ సర్వైవల్ థ్రిల్లర్ ను చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా పేరు జియామ్. థాయ్ భాషకు చెందిన ఈ సినిమా ఏకంగా 17 భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జాంబి సినిమాలు చూడాలనుకునేవారికి జియామ్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. తెలుగులో అందుబాటుల లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో మూవీని ఎంజాయ్ చేయవచ్చు.

జియామ్ మూవీలోని ఓ సీన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..