OTT Movie: ఓటీటీలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ…మిస్ అవ్వకుండా చూడాల్సిన రియల్ స్టోరీ.. IMDBలో 8.6 రేటింగ్

కొన్ని నెలల క్రితమే ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ కు ముందే వివాదాల్లో నిలిచింది. ముఖ్యంగా ఇందులోని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొందరి మనోభావాలు దెబ్బతినడంతో బ్యాన్ చేయాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది.

OTT Movie: ఓటీటీలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ...మిస్ అవ్వకుండా చూడాల్సిన రియల్ స్టోరీ.. IMDBలో 8.6 రేటింగ్
HAQ Movie

Updated on: Dec 27, 2025 | 8:28 PM

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తులు, సంచలన కేసుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. వీటికి ఆడియెన్స్ నుంచి కూడా మంచి ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా ఓటీటీలో రియల్ స్టోరీ సినిమాలు, సిరీస్ లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ స్టోరీనే. ఒక సంచలన కేసు ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. నవంబర్ 07న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. అయితే రిలీజ్ కు ముందు ఈ సినిమా పలు వివాదాల్లో చిక్కుకుంది. ఇందులోని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఓ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతినడంతో ఈ మూవీపై నిషేధం విధించాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. ఇలా వివాదాలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా వచ్చాయి.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భర్త రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత ఓ మహిళ జీవితం అల్లకల్లోలంగా మారుతుంది. అలా మారిన షా బానో అనే మహిళ కథే ఇది. ఇదొక రియల్ స్టోరీ. 1975లో షా బానోను ఆమె భర్త, న్యాయవాది మొహమ్మద్ అహ్మద్ ఖాన్ ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చి ఆమెను వదిలేశాడు. అయితే తనకు జరిగిన అన్యాయంపై షాబానో కోర్టు మెట్లెక్కుతుంది. భర్త నుంచి భరణం ఇప్పించాలంటూ కేసు దాఖలు చేస్తుంది. మరి చివరకు ఆ కేసు ఎలా సాగిందన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షా బానో వర్సెస్‌ అహ్మద్‌ ఖాన్‌ కేసు ఆధారంగా తెరకెక్కిన సినిమా హక్. సుపర్ణ్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో యామీ గౌతమ్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. కొత్త సంవత్సరం కానుకగా జనవరి 02 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ కాంట్రవర్సీ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.