ఒంటరిగా ఉన్నప్పుడే చూడండి.. ఇద్దరమ్మాయిల రచ్చ.. ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ సినిమా

థ్రిల్లర్, హారర్ మూవీస్ చూడటానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే రొమాంటిక్ మూవీస్ కు కూడా ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే ఓటీటీలో చాలా రకాల రొమాంటిక్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ రొమాంటిక్ సినిమా ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోంది. ఈ సినిమా చూసిన వారంతా ఇదెక్కడి సినిమారా మావా అంటున్నారు.

ఒంటరిగా ఉన్నప్పుడే చూడండి.. ఇద్దరమ్మాయిల రచ్చ.. ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ సినిమా
Ott Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 08, 2024 | 5:53 PM

ఓటీటీలో వందల కొద్దీ సినిమాలు అందుబాటులో ఉంటాయి.  థియేటర్స్ లో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటే.. ఓటీటీలో మాత్రం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా రకాల సినిమాలు ఓటీటీల్లో అదరగొడుతున్నాయి. ఇక థ్రిల్లర్, హారర్ మూవీస్ చూడటానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే రొమాంటిక్ మూవీస్ కు కూడా ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే ఓటీటీలో చాలా రకాల రొమాంటిక్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ రొమాంటిక్ సినిమా ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోంది. ఈ సినిమా చూసిన వారంతా ఇదెక్కడి సినిమారా మావా అంటున్నారు. ఆ రేంజ్ లో ఉంది ఆ సినిమా.. అబ్బాయి- అమ్మాయి మధ్య పుట్టడం చాలా కామన్. కానీ ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం అనేది కాస్త వెరైటీ అనే చెప్పాలి.

ఇక్కడ చదవండి : అరియానాతోనూ రాజ్ తరుణ్‌కు ఎఫైర్.. ఒకొక్క యవ్వారం బయటపెడుతున్న లావణ్య

ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం అనే కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. మొన్నామధ్య రామ్ గోపాల్ వర్మ కూడా అప్సరరాణిని పెట్టి ఇలాంటి సినిమానే చేశాడు. ఇక ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోన్న రొమాంటిక్ సినిమా మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఓ అమ్మాయి నైట్ క్లబ్ లో సింగర్ గా చేస్తుంది. మరో అమ్మాయి క్రియేటివ్ ఫీల్డ్ లో ఉంటుంది. ఈ ఇద్దరూ అనుకోకుండా కలుసుకుంటారు.. తొలి చూపులోనే ఒకరినొకరు ఇష్టపడతారు. ఆతర్వాత మాటలు కలుస్తాయి.

ఇది కూడా చదవండి : అరియానాతోనూ రాజ్ తరుణ్‌కు ఎఫైర్.. ఒకొక్క యవ్వారం బయటపెడుతున్న లావణ్య

అనుకోకుండా ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. దాంతో ఇద్దరూ లివిన్ రిలేషన్ లోకి వెళ్తారు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. ఒకరినొకరు వదిలి ఉండలేనంతగా ప్రేమ పెరిగిపోతుంది. ఆతర్వాత ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. గొడవలు మొదలవుతాయి. సింగర్ అమ్మాయి.. ఆ క్రియేటివ్ ఫీల్డ్ అమ్మాయిని కొడుతుంది కూడా.. అలాగే దూరం పెడుతుంది. నన్ను తాకకు అనేంతగా గొడవపడుతారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది.? ఎందుకు ఈ ఇద్దరు గొడవ పడ్డారు.? ఆతర్వాత కలిశారా.? అసలు ఏమైంది అనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కువే ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో చూడలేం.. ఒంటరిగా ఈ సినిమా చూడటం బెటర్.. ఈ సినిమా పేరు డక్ బటర్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.