Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరియానాతోనూ రాజ్ తరుణ్‌కు ఎఫైర్.. ఒకొక్క యవ్వారం బయటపెడుతున్న లావణ్య

తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని. సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నాడు అంటుంది లావణ్య అనే యువతి. తనను ప్రేమించి ఇప్పుడు మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ తీవ్ర ఆరోపణలు చేసింది లావణ్య. రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడని.. అందుకే తనను దూరం పెడుతున్నాడని ఆరోపిస్తుంది లావణ్య. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా కలిసి తిరగబడరా సామి అనే సినిమా చేశారు.

అరియానాతోనూ రాజ్ తరుణ్‌కు ఎఫైర్.. ఒకొక్క యవ్వారం బయటపెడుతున్న లావణ్య
Raj Tarun
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 08, 2024 | 5:09 PM

రాజ్ తరుణ్, లావణ్య యవ్వారం రోజుకొక్క మలుపుతిరుగుతుంది. తనను మోసం చేశాడు అంటూ  లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని. సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నాడు అంటుంది లావణ్య అనే యువతి. తనను ప్రేమించి ఇప్పుడు మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ తీవ్ర ఆరోపణలు చేసింది లావణ్య. రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడని.. అందుకే తనను దూరం పెడుతున్నాడని ఆరోపిస్తుంది లావణ్య. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా కలిసి తిరగబడరా సామి అనే సినిమా చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తనపై లావణ్య చేసిన ఆరోపణలను రాజ్ తరుణ్ ఖండించాడు.

ఇది కూడా చదవండి : Jabardasth Faima: పెళ్లి ఎప్పుడో చెప్పేసిన జబర్దస్త్ ఫైమా.. ప్రియుడి ఇంటిపేరు ఇదే

లావణ్య అనే అమ్మాయితో రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే అని.. కాకపోతే ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉందని, అలాగే వేరే అబ్బాయితో ఆమె రిలేషన్ లో ఉందని రాజ్ తరుణ్ అన్నారు. మాల్వీ మల్హోత్రాతో రిలేషన్ లో ఉన్నానంటూ ఆమె చేసిన ఆరోపణల్లో నిజం లేదు అంటున్నారు ఈ హీరోగారు. కానీ లావణ్య మాత్రం రాజ్ తరుణ్ గురించి షాకింగ్ విషయాలు బయటపెడుతోంది. తాను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా మాట నిజమే కానీ తాను డ్రగ్స్ వాడలేదు అని అంటుంది లావణ్య.

ఇది కూడా చదవండి :స్టార్ హీరోని కూడా లెక్క చేయలేదు.. ఆమెకు చాలా పొగరు.. ప్రభాస్ దర్శకుడి కామెంట్స్

తాజాగా రాజ్ తరుణ్ కు బిగ్ బాస్ ఫెమ్ అరియానా గ్లోరీ కి కూడా ఎఫైర్ ఉందని ;అంటుంది రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య. మాల్వి మల్హోత్రతోనే కాదు మరికొంతమందితోనూ రాజ్ తరుణ్ కు ఎఫైర్ ఉందని తెలిపింది లావణ్య. ఈ క్రమంలోనే అరియానాతోనూ అతను ఎఫైర్ పెట్టుకున్నాడని.. అరియానా గ్లోరీతో ఒక్కరోజు మాత్రమే షూటింగ్‌కి వెళ్లాడు రాజ్ తరుణ్. నేను కోర్స్ నేర్చుకోవడానికి మూడు నెలలు గోవా వెళ్లాను ఆ టైం లో రాజ్ తరుణ్ అరియానాకు దగ్గరయ్యాడు. నేను వెళ్లిన నెలరోజులకు రాజ్ తరుణ్, అరియానా కలవడం మొదలు పెట్టారు. ఈ విషయం నాకు రాజ్ తరుణ్ మేనేజర్, నటుడు రాజా రవీంద్ర ఫోన్ చేసి చెప్పారు.. లేకపోతే ఈ ఇద్దరి యవ్వారం నాకు తెలిసేది కాదు అని తెలిపింది లావణ్య.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.