స్టార్ హీరోని కూడా లెక్క చేయలేదు.. ఆమెకు చాలా పొగరు.. ప్రభాస్ దర్శకుడి కామెంట్స్

యూత్ ను ఆకట్టుకునే కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు మారుతి. ఈ రోజుల్లో సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత బస్ స్టాప్, ప్రేమకథ చిత్రం సినిమాలతో వరుసగా హిట్స్ అందుకొని హ్యాట్రిక్ హిట్స్ సాధించాడు. దాంతో మారుతి టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిపోయాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు మారుతి.

స్టార్ హీరోని కూడా లెక్క చేయలేదు.. ఆమెకు చాలా పొగరు.. ప్రభాస్ దర్శకుడి కామెంట్స్
Maruti
Follow us

|

Updated on: Jul 08, 2024 | 3:44 PM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మారుతి. ఈరోజుల్లో అనే సినిమాతో మారుతి పేరు మరురోగింది. యూత్‌ను ఆకట్టుకునే కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఈ రోజుల్లో సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాదు థియేటర్స్ వందరోజులు ఆడింది ఈ సినిమా. ఆతర్వాత బస్ స్టాప్, ప్రేమకథ చిత్రం సినిమాలతో వరుసగా హిట్స్ అందుకొని హ్యాట్రిక్ హిట్స్ సాధించాడు. దాంతో మారుతి టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిపోయాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు మారుతి. ఈ సినిమాతో నాని క్రేజ్ కూడా మరింత పెరిగింది. ఆ తర్వాత వరుసగా బాబు బంగారం, మహానుభావుడు, శైలజా రెడ్డి అల్లుడు, ప్రతిరోజూ పండగే, మంచి రోజులు వ‌చ్చాయి, పక్కా కమర్షియల్ లాంటి సినిమాలను తెరకెక్కిచాడు.

ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు మారుతి ఓ స్టార్ హీరోయిన్ గురించి సంచలన కామెంట్స్ చేశాడు. స్టార్ హీరోయిన్ తో మారుతి గొడవపడ్డారు. ఇదే విషయం పై మారుతి ఓ ఇంటర్వ్యూలోనూ మాట్లాడారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార. అవును.. నయన్ మారుతి దర్శకత్వంలో బాబు బంగారం అనే సినిమా చేసింది. ఈసినిమాలో వెంకటేష్ హీరోగా చేశారు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నయనతార, మారుతికి మధ్య వాగ్వాదం జరిగిందట.

మారుతి మాట్లాడుతూ.. బాబు బంగారం షూటింగ్ లో నయనతార చిత్రయూనిట్ కు సహకరించేది కాదు.. నేను అప్పటికి పెద్ద దర్శకుడు కాకపోవచ్చు.. నన్ను గౌరవించకపోయినా పర్లేదు. కానీ వెంకటేష్‌లాంటి సీనియర్ హీరోలను కూడా ఆమె లెక్క చేసేది కాదు. నేను ఎంతో ఓపికగా భరించా కానీ ఒకేసారి ఆమెతో వాగ్వాదానికి దిగాను. దాంతో ఆమె షూటింగ్ నుంచి వెళ్ళిపోయింది. ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది.. దాని కోసం రమ్మంటే .. వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను. డేట్స్ ఖాళీ లేవు అని చెప్పింది.. దాంతో ఓ పాట లేకుండానే సినిమాను రిలీజ్ చేశాం అని మారుతి తెలిపారు. ఇక ప్రస్తుతం మారుతి ప్రభాస్‌తో సినిమా చేస్తున్నారు. ది రాజా సాబ్ అనే టైటిల్ తో మారుతి సినిమా చేస్తున్నారు. ఈ సినిమానుంచి ప్రభాస్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే మారుతి క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. ఇప్పటికే ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో సంచలన విజయాలను అందుకున్నాడు. ఇక ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
ఆ తాగునీటితో క్యాన్సర్‌.. ఏం జరిగిందంటే.! వీడియో..
ఆ తాగునీటితో క్యాన్సర్‌.. ఏం జరిగిందంటే.! వీడియో..
హాస్టల్‌ భోజనంలో పురుగులు, బొద్దింకలు ప్రత్యక్షం.! వీడియో వైరల్.
హాస్టల్‌ భోజనంలో పురుగులు, బొద్దింకలు ప్రత్యక్షం.! వీడియో వైరల్.
ముందు పేలుడు. ఆపై అంతా చీకటి.. రైలు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి.!
ముందు పేలుడు. ఆపై అంతా చీకటి.. రైలు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి.!