జెనీలియా, రితీష్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్.. ఎందరికో స్ఫూర్తి అంటూ..

బాయ్స్ సినిమాతో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మెరిసింది. జెనీలియా పేరు చెప్తే గుర్తొచ్చే సినిమాల్లో బొమ్మరిల్లు ముందు ప్లేస్ లో ఉంటుంది. ఆలాగే సై, ఢీ , హ్యాపీ, ఆరెంజ్ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ హీరో రితీష్ దేశ్‌ముఖ్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే..

జెనీలియా, రితీష్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్.. ఎందరికో స్ఫూర్తి అంటూ..
Riteish Deshmukh, Genelia
Follow us

|

Updated on: Jul 08, 2024 | 3:05 PM

జెనీలియా డిసౌజా..ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరేట్ హీరోయిన్. చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. బాయ్స్ సినిమాతో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మెరిసింది. జెనీలియా పేరు చెప్తే గుర్తొచ్చే సినిమాల్లో బొమ్మరిల్లు ముందు ప్లేస్ లో ఉంటుంది. ఆలాగే సై, ఢీ, హ్యాపీ, ఆరెంజ్ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ హీరో రితీష్ దేశ్‌ముఖ్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే..ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత జెనీలియా సినిమాలకు దూరం అయ్యారు. ఇటీవలే వేద్ అనే ఓ మరాఠీ సినిమాలో నటించింది జెనీలియా.తాజాగా ఈ సెలబ్రిటీ జంట చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

జెనీలియా, రితీష్ దేశ్‌ముఖ్ అవయవ దానం చేశారు. ఇందుకు గాను ఆ దంపతులకు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ కృతజ్ఞతలు తెలిపింది. రితేష్ ఇందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అవయవ దానం ఎంతో గొప్ప దానం. దీని వల్ల వ్యక్తి మరణించిన తర్వాత కళ్ళు మరికొన్ని అవయవాలు ఇతరులకు ఉపయోగపడతాయి. రితేష్, జెనీలియా తీసుకున్న ఈ నిర్ణయం పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇంతకుముందు రితేష్ మాట్లాడుతూ.. ”నేనూ, జెనీలియా మా అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశాం’’ అని రితేష్ తెలిపారు. ఈ విషయాన్ని జెనీలియా కూడా తెలిపింది. ఈ వీడియోను నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ షేర్ చేసింది. రితేష్‌, జెనీలియాకు ధన్యవాదాలు. ఈ ఇద్దరూ తమ అవయవాలు దానం చేస్తానని ప్రమాణం చేశారు. వీరి నిర్ణయం ఎందరికో స్ఫూర్తిగా నిలవాలి’ అని రాసుకొచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. సోనాక్షి సిన్హా, షకీబ్ సలీమ్‌లతో కలిసి రితేష్ ‘కాకుడ’ సినిమాలో నటిస్తున్నాడు. ఆదిత్య సర్పోథర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 12న సినిమా విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.