ఎప్పుడూ మాస్ యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే నందమూరి నటసింహం బాలకృష్ణలోని మరో కోణాన్ని తెర ముందుకు తీసుకువచ్చింది ఆహా. ఆయన హోస్ట్‌గా వస్తోన్న షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ షోకు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ సీజన్ కంటే.. మరింత ఎక్కువ రెస్పాన్స్ అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది అన్ స్టాపబుల్ షో. ఇటీవల ఇందులోకి ప్రభాస్.. తన స్నేహితుడు గోపిచంద్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన రెండు ఎపిసోడ్స్ వ్యూస్ రికార్డ్స్ బద్దలు కొట్టాయి. డార్లింగ్ చిత్రాల కోసం వేయి కళ్లతో ఎదురుచూసే అభిమానులకు ఈ ఎపిసోడ్స్ తో స్పెషల్ ట్రీట్ ఇచ్చారు ఆన్ స్టాపబుల్ మేకర్స్. ఇందులో తన సినిమా అప్డేట్స్ కంటే ఎక్కువగా ప్రభాస్ ప్రేమ, పెళ్లి గురించి చర్చ జరిగింది. ఇక తాజాగా ఈ ఎపిసోడ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది ఆహా.
ప్రభాస్ ఇన్ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ డార్లింగ్ అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చింది ఆహా. అందులో స్టేజ్ పైనే కాకుండా.. తెర వెనక బాలయ్యతో డార్లింగ్.. గోపిచంద్ చేసిన అల్లరి చూపించింది. అందులో బాలకృష్ణ.,. మీట్ ది రియల్ సైడ్ అఫ్ బాలకృష్ణ అంటూ ప్రభాస్ కు చెబుతుండగా.. అయ్యో నాకు తెలుసు సార్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు డార్లింగ్. అలాగే ఆహా టీం తనకు ఇంకో కుటుంబం అంటూ చెప్పుకొచ్చాడు బాలయ్య..
ఇక బాలయ్యతో సరదాగా గడిపిన అనంతరం అక్కడున్న అభిమానులకు సెల్ఫీ ఫోజులిచ్చాడు. అలాగే వారితో ముచ్చటించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్న ఈ వీడియో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు ఉండగా.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలోనూ మరో సినిమా చేస్తున్నారు ప్రభాస్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.