The Vaccine War OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

|

Nov 25, 2023 | 10:07 AM

వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన మరో చిత్రం 'ది వ్యాక్సిన్ వార్'. భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ తయారీ నేపథ్యంలో వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ మూవీని తెరకెక్కించారు. సెప్టెంబర్ 28న ది వ్యాక్సిన్‌ వార్‌ థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే కశ్మీర్ ఫైల్స్‌ తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రివ్యూలు పాజిటివ్‍గా నే వచ్చినా ఆశించిన స్థాయిలో మాత్రం కలెక్షన్లు రాలేదు

The Vaccine War OTT: ఓటీటీలోకి వచ్చేసిన ది వ్యాక్సిన్‌ వార్‌ సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
The Vaccine War Movie
Follow us on

‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో సంచలన విజయం దక్కించుకున్నారు బాలీవుడ్‌ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ మూవీ వివాదాల్లోనూ ఇరుక్కుంది. అలా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన మరో చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ తయారీ నేపథ్యంలో వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ మూవీని తెరకెక్కించారు. సెప్టెంబర్ 28న ది వ్యాక్సిన్‌ వార్‌ థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే కశ్మీర్ ఫైల్స్‌ తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రివ్యూలు పాజిటివ్‍గా నే వచ్చినా ఆశించిన స్థాయిలో మాత్రం కలెక్షన్లు రాలేదు. దీంతో ది వ్యాక్సిన్‌ వార్‌ మూవీ కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌ ది వ్యాక్సిన్‌ వార్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (నవంబర్‌ 24) నుంచి ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

అయితే ది వ్యాక్సిన్‌ వార్‌ సినిమా ప్రస్తుతం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల ఆడియో వెర్షన్‌ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ భాషల్లో స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వచ్చే విషయంపై డిస్నీ+ హాట్‍స్టార్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి హిందీలో మాత్రమే ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ది వ్యాక్సిన్‌ వార్‌ మూవీలో కాంతారా హీరోయిన్‌ సప్తమి గౌడ సైంటిస్ట్ గా నటించి మెప్పించింది. అలాగే నానా పటేకర్‌, పల్లవి జోషి, రైమాసేన్‌, అనుపమ్‌ ఖేర్‌, నివేదిత భట్టాచార్య, మోహన్ కపూర్, అంచల్ ద్వివేది, అరవింద్ పాశ్వాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఐయామ్ బుద్ధ పతాకంపై పల్లవి జోషినే ఈ సినిమాను నిర్మించారు. కరోనా వ్యాక్సిన్‌ తయారీ కోసం భారతీయ శాస్త్రవేత్తల బృందం ఎలా కష్టపడింది? మహిళా  సైంటిస్టులు ఎలాంటి పాత్ర పోషించారు? అనే అంశాలను ఈ సినిమాలో ఎంతో ఎమోషనల్‌గా చూపించారు వివేక్‌ అగ్రి హోత్రి. మరి థియేటర్లలో ది వ్యాక్సిన్ వార్‌ మూవీని మిస్‌ అయి ఉంటే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

హిందీలో మాత్రమే స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.