ఈ ఏడాది ఏ మాత్రం అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన చిత్రం ’12th ఫెయిల్’. మనోజ్ కుమార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా విధు వినోద్ చోప్రా ఈ మూవీని తెరకెక్కించాడు. విక్రాంత్ మస్సే హీరోగా నటించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా అక్టోబర్ 27న థియేటర్లలో విడుదలైన 12th ఫెయిల్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కేవలం మౌత్ టాక్‌తోనే కోట్లాది రూపాయల వసూళ్లు రాబట్టింది. కేవలం 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ బయోపిక్ ఏకంగా 70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. విద్యావ్యవస్థలోని లోపాలతో పాటు పేద విద్యార్థుల జీవితాలను 12th ఫెయిల్ సినిమాలో ఎంతో హృద్యంగా చూపించారు డైరెక్టర్ విధు వినోద్ చోప్రా. పలువురు సినీ ప్రముఖులు, విమర్శకులు ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇన్ని విశేషాలున్న 12th ఫెయిల్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ బయోపిక్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. శుక్రవారం (డిసెంబర్ 29) అర్ధ రాత్రి నుంచి ’12th ఫెయిల్’ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లోనూ ఈ బయోపిక్ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
అనురాగ్ పాఠక్ రాసిన నవల ఆధారంగా ’12th ఫెయిల్’ సినిమాను తెరకెక్కించారు. ఇక సినిమా కథ ఎంతో ఇన్‌స్పైరింగ్ గా ఉంటుంది. మనోజ్ కుమార్ (విక్రాంత్ మస్సే) 12వ తరగతిలో ఫెయిల్ అవుతాడు. దీంతో పొట్ట కూటి కోసం ఆటో డ్రైవర్ గా మారతాడు. అయితే ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలన్న తన కలల ప్రయాణాన్ని మాత్రం అసలు వదులు కోడు. మరి ఆటో డ్రైవర్ ఐపీఎస్‌గా ఎలా మారాడన్నది తెలుసుకోవాలంటే 12th ఫెయిల్ మూవీని చూడాల్సిందే. వినోద్ చోప్రా ఫిల్మ్స్‌పై విధు వినోద్ చోప్రా, యోగేష్ ఈశ్వర్ ఈ మూవీని నిర్మించారు. మేధా శంకర్, అనంత్ జోషి, అన్షుమాన్ పుష్కర్, ప్రియాంశు చటర్జీ, గీతా అగర్వాల్, హరీష్ ఖన్నా, సరితా జోషి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శంతాను మొయిత్రా సంగీతం అందించారు.
For 2024, bas Manoj Kumar Sharma jaisa jazba chahiye!
#12thFail now streaming.#12thFailOnHotstar #ZeroSeKarRestart pic.twitter.com/XvMbKQyvlw— Disney+ Hotstar (@DisneyPlusHS) December 31, 2023
Ending the year with Manoj Kumar Sharma’s tale of undying perseverance.#12thFail Now Streaming.
Watch Now: https://t.co/BhvgwPVWB6#12thFailOnHotstar #ZeroSeKarRestart pic.twitter.com/GQcx3SE051
— Disney+ Hotstar (@DisneyPlusHS) December 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.