OTT Movie: 46 ఇంటర్నేషనల్ అవార్డులతో సంచలనం.. ఓటీటీలోకి వచ్చేసిన నల్గొండ కబడ్డీ ప్లేయర్ రియల్ లైఫ్ స్టోరీ

నల్గొండకు చెందిన దిగ్గజ కబడ్డీ ప్లేయర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. థియేటర్లలో పెద్దగా ఆడనప్పటికీ ఈ సినిమాకు ఏకంగా 46 అంతర్జాతీయ అవార్డులు ప్రశంసలు దక్కాయి. అలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: 46 ఇంటర్నేషనల్ అవార్డులతో సంచలనం.. ఓటీటీలోకి వచ్చేసిన నల్గొండ కబడ్డీ ప్లేయర్ రియల్ లైఫ్ స్టోరీ
OTT Movie

Updated on: Oct 26, 2025 | 5:55 PM

ఈ శుక్రవారం (అక్టోబర్ 24) థియేటర్లలో పాటు ఓటీటీలోనూ పలు కొత్త సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో ఒక తెలుగు సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఇప్పటికే 46 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. నల్గొండ కబడ్డీ ప్లేయర్ నాగులయ్య జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1980 – 96ల మధ్య జరిగిన ఓ రియల్ లైఫ్ స్టోరీ ఇది. అనాథ అయిన అర్జున్ చక్రవర్తి (విజయ రామరాజు)ని మాజీ కబడ్డీ ప్లేయర్ రంగయ్య (దయానంద్ రెడ్డి) చేరదీస్తాడు. రంగయ్యలాగే తాను కూడా కబడ్డీలో నేషనల్ ప్లేయర్ కావాలని అనుకుంటాడు హీరో. అర్జున్ ఇష్టాన్ని గుర్తించిన రంగయ్య ఆ పిల్లాడు తన మేనల్లుడినని చెప్పుకుంటూ కబడ్డీలో ట్రైనింగ్ ఇస్తాడు. ఆటలో రాటు తేలుతాడు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటుతాడు. ఇదే క్రమంలో దేవిక (సిజా రోజ్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు

అయితే దేశం కోసం ఓ కీలక మ్యాచ్ ఆడాల్సి రావడంతో కొన్ని రోజులు దేవికకు దూరంగా ఉండిపోతాడు అర్జున్. కానీ ఆ మ్యాచ్ కంప్లీట్ అయ్యాక అర్జున్ పూర్తిగా మద్యానికి బానిస అవుతాడు. ప్రాణానికి ప్రాణమైన కబడ్డీని వదిలిపెడతాడు. అసలు అర్జున్ లైఫ్ లో ఏం జరిగింది? ఎందుకు అతను మద్యానికి బానిసయ్యాడు. కబడ్డీని ఎందుకు దూరం పెట్టాడు? దేవికతో ప్రేమ వ్యవహారం ఏమైంది? చివరకు అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

ఈ సినిమా పేరు అర్జున్ చక్రవర్తి. విక్రాంత్ రుద్ర తెరకెక్కించిన ఈ రియల్ లైఫ్ స్టోరీలో విజయరామరాజు, సిజా రోజ్ హీరో, హీరోయిన్లు గా నటించారు. దయానంద్ రెడ్డి, హర్ష్ రోషన్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి