LEO OTT: అనుకున్న టైమ్‌ కంటే ముందుగానే ఓటీటీలోకి విజయ్‌ ‘లియో’ సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

|

Nov 05, 2023 | 3:02 PM

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దళపతి, స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా లియో. దసరా కానుకగా అక్టోబర్‌ 19న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. హీరో విజయ్‌ దళపతి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో అయితే

LEO OTT: అనుకున్న టైమ్‌ కంటే ముందుగానే ఓటీటీలోకి విజయ్‌ లియో సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Leo Movie
Follow us on

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దళపతి, స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా లియో. దసరా కానుకగా అక్టోబర్‌ 19న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. హీరో విజయ్‌ దళపతి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో అయితే బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్‌ నాగేశ్వర రావు సినిమాల పోటీని తట్టుకుని మరీ భారీ వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్‌ నిపుణులు పేర్కొన్నారు. థియేటర్లలో అలరించిన లియో సినిమా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది. విజయ్‌ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 16న ఓటీటీలోకి లియో సినిమాను తీసుకురానున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గతంలో నవంబర్‌ 21న లియో సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు 5 రోజులు ముందుగానే విజయ్‌ సినిమా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయనున్నారని సామాజిక మాధ్యమాల్లో టాక్‌ నడుస్తోంది.

సినిమా లీక్ అయినందుకే..

కాగా ఇప్పటికే  కొన్ని పైరసీ సైట్లలో విజయ్ సినిమా లీక్ అయ్యింది.  అందుకే ఓటీటీలోకి ముందుగానే రానున్నట్లు తెలుస్తోంది. లియో సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించింది. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ విలన్‌గా నటించాడు. అలాగే యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా, మిస్కిన్‌, మడోన్నా సెబాస్టియన్‌, మన్సూర్‌ అలీఖాన్‌, ప్రియా ఆనంద్‌, మాథ్యూ థామస్‌, లీలా శామ్సన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెవెన్‌ స్ర్రీన్‌ స్టూడియో బ్యానర్‌పై లలిత్‌ కుమార్‌, జగదీష్‌ పళని స్వామి భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా లియో సినిమాను నిర్మించారు. జవాన్‌ సినిమాతో పాన్‌ ఇండియాలో రేంజ్‌లో ఫేమస్‌ అయిన అనిరుధ్‌ రవిచందర్‌ లియో సినిమాకు స్వరాలు సమకూర్చాడు. కాగా థియేటర్‌ వెర్షన్‌తో పోల్చుకుంటే లియో ఓటీటీ వెర్షన్‌ డిఫరెంట్‌గా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదనపు సీన్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

లియో సినిమాలో విజయ్, త్రిష..

 

లియో సక్సెస్ మీట్ లో విజయ్ దళపతి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.