కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతపతి, బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్ జంటగా నటించిన సినిమా మేరీ క్రిస్మస్. అంధాధూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ఈ మిస్టరి థ్రిల్లర్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే అప్పటికే బరిలో పలు స్టార్ హీరోల సినిమాలు ఉండడంతో భారీ వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే మేరీ క్రిస్మస్ లోని సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సూపర్బ్ గా ఉన్నాయంటూ రివ్యూలు వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించిన మేరీ క్రిస్మస్ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఓటీటీ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత విజయ్, కత్రినాల మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింద. మహా శివరాత్రి కానుకగా శుక్రవారం (మార్చి 8) అర్ధరాత్రి నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో మేరీ క్రిస్మస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. హిందీతోపాటు తెలుగు, తమిళం ఇతర భాషల్లోనూ ఈ థ్రిల్లర్ మూవీ అందుబాటులో ఉంది.
మేరీ క్రిస్మస్ సినిమాలో విజయ్, కత్రినాలతో పాటు అశ్వినీ కల్సేఖర్, ల్యూక్ కెన్నీ, పరి మహేశ్వరి శర్మ, సంజయ్ కపూర్, గాయత్రీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. టిప్స్ ఫిల్మ్స్, మ్యాచ్‍బాక్స్ పిక్టర్స్ బ్యానర్లపై రమేశ్ తౌరానీ, జయ తౌరానీ, సంజయ్ రౌట్రే, కేవల్ గార్గ్ సంయుక్తంగా ఈ థ్రిల్లర్ ను నిర్మించారు. ప్రీతమ్, డానియెల్ బీ జార్జ్ సంగీతం అందించారు. ఈ వీకెండ్ లో మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్
ఉన్న మూవీ చూడాలనుకుంటున్నారా? అయితే మేరీ క్రిస్మస్ మీకు ఒక మంచి ఛాయిస్.
This meet-cute on Christmas Eve may not be as merry as you might think!
Packed with twists you’ll never see coming – Merry Christmas is NOW STREAMING in Hindi, Tamil and Telugu on Netflix! 🎅#MerryChristmasOnNetflix pic.twitter.com/tyx2tr7jcL— Netflix India (@NetflixIndia) March 7, 2024
#MerryChristmasOnNetflix #MovieReview 8.7🌟/10🌟. #vijaysethupati & #KatrinaKaif star in a wholesome mystery/noir cinema. Best work of #Katrina & @VijaySethuOffl grt as usual .Cerebral & creative post 50 mins of watching. Give it time till 50min..Worth it #Netflix #MerryChristmas pic.twitter.com/Thx57JpRzs
— COCO (@COCOJUMBO297) March 8, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.