OTT Movie: రూ.800 కోట్ల స్కామ్.. ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్ మూవీ

కొన్ని రోజుల క్రితమే థియేటర్లోలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. రూ. 8000 కోట్ల భూ స్కామ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి గానే కలెక్షన్లు వచ్చాయి. అలాగే ఐఎమ్‌డీబీ లోనూ 7.5/ 10 రేటింగ్ కూడా వచ్చింది.

OTT Movie: రూ.800 కోట్ల స్కామ్.. ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్  థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్ మూవీ
Ott Movie

Updated on: Oct 25, 2025 | 6:45 AM

ఎప్పటిలాగే ఈ శుక్రవారం(అక్టోబర్ 23) పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో ఒక సినిమా చాలా ఇంట్రెస్టింట్ గా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం థియేటర్లతో పాటు ఓటీటీలోనూ హారర్, సస్పెన్స్, క్రైమ్ జానర్ సినిమాలదే హవా. అయితే ఈ మూవీ మాత్రం చాలా డిఫరెంట్ గా రెగ్యులర్ జోనర్స్‌లో కాకుండా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కింది. కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఆసక్తికరమైన కథ కథనాలు ఉండడంతో ఆడియెన్స్ ను బాగానే మెప్పించింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ప్రస్తుతం సమకాలీన రాజకీయాలకు ఈ మూవీ అద్దం పడుతుంది. రూ. 800 కోట్ల భూమి స్కామ్, ఓ బ్రోకర్ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. కేంద్ర మంత్రికి సంబంధించిన 800 కోట్లను పట్టుకునే క్రమంలో బ్రోకర్ దగ్గరి నుంచి వేల కోట్లు బయటపడటం సంచలనంగా మారుతుంది.
ఒక సాధారణ వ్యక్తి వ్యవస్థలోని అవినీతి, అన్యాయం, రాజకీయ కుట్రల మధ్య ఎలా ఇరుక్కుంటాడు, తన కుటుంబం, తన విలువల కోసం ఎలాంటి పోరాటం చేస్తాడు. అలాగే ఓ పవర్ బ్రోకర్ గా ట్లాది ఆస్తులు కూడ బెట్టాడు? చివరకు ఏమైందన్నదే ఈ సినిమా స్టోరీ.

ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగే ఈ సినిమా పేరు భద్రకాళి. బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని ఇందులో హీరోగా నటించాడు. అలాగే వా గై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, కిరణ్, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అరుణ్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమాను విజయ్ ఆంటోని నిర్మించడం విశేషం. శుక్రవారం (అక్టోబర్ 24) అర్ధరాత్రి నుంచి భద్రకాళి సినిమా జియో హాట్ స్టార్ ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మంచి పొలిటికల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు భద్రకాళి సినిమాను బాగా ఎంజాయ్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

తెలుగులోనూ విజయ్ ఆంటోని సినిమా స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.