Chhaava OTT: బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది! విక్కీ కౌశల్, రష్మికల ‘ఛావా’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'చావా'. ఈ సినిమా థియేటర్లలో విడుదలై సుమారు 50 రోజులు గడుస్తోంది. అయినా ఈ సినిమాకు ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఇదిలా ఉండగానే ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యిందీ బ్లాక్ బస్టర్ మూవీ.

Chhaava OTT: బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది! విక్కీ కౌశల్, రష్మికల ఛావా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
Chhaava Movie

Updated on: May 06, 2025 | 10:15 AM

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ చిత్రం ఫిబ్రవరి 14, 2025న థియేటర్లలో విడుదలైంది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధిస్తూ ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన ‘ఛావా’ సినిమా భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. చావా’ సినిమా థియేటర్లో విడదులై సుమారు రెండు నెలలు గడుస్తోంది. అయినా ఈ సినిమాకు ప్రజాదరణ తగ్గడం లేదు. మరోవైపు ఈ హిస్టారికల్ మూవీని ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ ఎదురుచూపులకు తెర పడనుంది. ఛావా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11 నుంచి ఈ బ్లాక్ బస్టర్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. హిందీతో పాటు తెలుగు తదితర దక్షిణాది భాషల్లోనూ ఛావా ఒకేసారి స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది.

ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ ధైర్యసాహసాల ఆధారంగా ఛావా సినిమాను తెరకెక్కించారు. ఇందులో విక్కీ కౌశల్ మరాఠా యోధుడి పాత్రలో నటించి అభిమానుల మెప్పు పొందాడు. శంభాజీ భార్యగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఇక ఔరంగజేబుగా అందరి మన్ననలు అందుకున్నాడు అక్షయ్ ఖన్నా. వీరితో పాటు డయానా పెంటీ, అశుతోష్ రాణా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేకర్, అలోక్నాథ్, ప్రదీప్ రావత్ తదితర ప్రముఖులు ఈ సినిమాలో వివిధ పాత్రలు పోషించారు. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ నిర్మించిన ఛావా సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఆస్కార్ విజేత రెహమాన్ ఈ సినిమాకు స్వరాలందించాడు.

ఇవి కూడా చదవండి

ఏప్రిల్ 11 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఛావా సినిమా స్ట్రీమింగ్..

తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.