విక్టరీ వెంకటేశ్ సైంధవ్ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు. జనవరి 13న థియేటర్లలో రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ యావరేజ్‌తో సరిపెట్టుకుంది. మిక్స్‌డ్ టాక్ రావడం, హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగ వంటి సినిమాలు సంక్రాంతి బరిలో నిలవడంతో సైంధవ్ యావరేజ్ వసూళ్లతో సరిపెట్టుకుంది. హిట్, హిట్ 2 చిత్రాల ఫేమ్ శైలేష్ కొలను తెరకెక్కించిన సైంధవ్ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నవాజుద్దీన్ సిద్ధీఖీ విలన్ గా మెప్పించాడు. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన సినిమాలో యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. వెంకటేశ్ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. అయితే కథ, కథనాలు ఆకట్టుకోలేకపోవడంతో జనాలకు పెద్దగా ఎక్కలేదీ సినిమా. దీంతో సైంధవ్ ఓ మోస్తరు వసూళ్లతోనే సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో అనుకున్న తేదీ కంటే ముందుగానే వెంకీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సైంధవ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి నెలాఖరునే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారు. అయితే థియేటర్లలో పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో ముందుగానే వెంకీ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఫిబ్రవరి మొదటి వారంలోనే..
ఫిబ్రవరి 9 లేదా 10వ తేదీల్లో ఏదో ఒక రోజు సైంధవ్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ మలయాళ భాషల్లోనూ ఈ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై బోయిన పల్లి వెంకట్ సైంధవ్ సినిమాను నిర్మించారు. దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు. కూతురి ప్రాణాలను దక్కించుకోవడానికి కార్టెల్ అనే మాఫియా గ్యాంగ్‌తో సైంధవ్ ఎలాంటి పోరాటం సాగించాడన్నదే ఈ కథ. యాక్షన్ సినిమాలు చూడాలనుకునేవారికి సైంధవ్ బాగా నచ్చుతుంది. సో.. డోంట్ మిస్.
The emotion of #Saindhav is being felt & loved by the audience ❤️🔥
Book your tickets now & enjoy the action-packed emotional entertainer in cinemas near you 💥
Victory @VenkyMama #SsaraPalekar @KolanuSailesh @Nawazuddin_S @arya_offl @shraddhasrinath… pic.twitter.com/mPhHtEUp2j
— Niharika Entertainment (@NiharikaEnt) January 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.