టీవీ రియాలిటీ షోస్, డ్యాన్స్ షోలతో బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఓంకార్. తన హోస్టింగ్ స్కిల్స్, ట్యాలెంట్‌తో ఓంకార్ అన్నయ్యగా ప్రేక్షకుల్లో మంచి అభిమానం సొంతం చేసుకున్నాడు.రాజుగారి గది సిరీస్ సినిమాలతో సిల్వర్ స్క్రీన్‌పై సినిమా ప్రేక్షకులను కూడా భయపెట్టాడు. అలాగే డ్యాన్స్ ఐకాన్, సిక్త్స్‌సెన్స్, కామెడీ స్టార్స్, ధమాకా వంటి రియాలిటీ షోస్‌కు క్రియేటర్‌గా, హోస్ట్‌గా వ్యవహరిస్తూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. ఇప్పుడు ఓ హార్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో భయపెట్టేందుకు మళ్లీ మన ముందుకు వచ్చాడు ఓంకార్ అన్నయ్య. మ్యాన్షన్ 24 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌లో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. అలాగే బిగ్‌బాస్ ఫేమ్ బిందుమాధవి , సత్యరాజ్, అవికాగోర్, అభినయ, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా, మానస్, అమర్‌దీప్ చౌదరి, , అయ్యప్ప చౌదరి, విద్యుల్లేఖ రామన్, మీనా కుమారి, రావు రమేష్.. ఇలా తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటీనటులు ఈ హార్రర్ వెబ్ సిరీస్‌లో నటించారు. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్‌లతో ఆసక్తిని రేకెత్తించిన మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మంగళవారం( అక్టోబర్ 17) నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.
మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఓంకార్ గతంలో తెరకెక్కించిన రాజుగాది సినిమాల ఫ్రాంఛైజీ తరహాలోనే మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్ కూడా హారర్ థ్రిల్లింగ్ కథనంతో సాగుతుంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పనిచేసే అమృత (వరలక్ష్మి) కనిపించకుండా పోయిన తన తండ్రి, ఆర్కియాలజిస్ట్ కాళిదాస్ కోసం వెతుకుతూ ఉంటుంది. తండ్రి సున్నితమైన సమాచారాన్ని తీసుకుని విదేశాలకు పారిపోయాడన్న ఆరోపణలు వస్తాయి. అయితే తన తండ్రిపై వచ్చిన ఆరోపణలను తప్పుగా నిరూపించేందుకు అమృత కంకణం కట్టుకుంటుంది. ఇందుకోసం అతనిని వెతుక్కుంటూ ఓ పాడుబడిన మ్యాన్షన్ కు వెళ్తుంది. మరి అక్కడ ఏం జరిగింది? మ్యాన్షన్ 24 కు వెళ్లిన వారందరూ ఏమయ్యారో తెలుసుకోవాలంటే ఈ హార్రర్ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..