2018లో కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ సినిమా 2018. వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ వర్సటైల్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటోన్న టొవినో థామస్ ఈ మూవీలో హీరోగా నటించాడు. అపర్ణా బాల మురళి, కుంచకో బోబన్, అసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్ కీలక పాత్రలు పోషించారు. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. మే 5న చిన్న సినిమాగా విడుదలైన 2018 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా దెబ్బకు మలయాళ సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నీ వరదలో కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు సుమారు రూ.155 కోట్ల వసూళ్లను సాధించిన ఈ మూవీ ఇటీవలే తెలుగులోనూ విడుదలైంది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ అధినేత బన్నీ వాస్ మే 26న ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు. 2018 సినిమాకు తెలుగు నాట కూడా భారీ వసూళ్లు వచ్చాయి. ఈ మూవీకి తెలుగులో మరిన్ని లాభాలు వచ్చే అవకాశముంది. అయితే ఇంతలోనే ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది.
‘2018’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో జూన్ 7వ తేదీ నుంచే ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ముందుగా కేవలం మలయాళ వెర్షన్‌ను మాత్రమే స్ట్రీమింగ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ‘2018’ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది ఓటీటీ ప్లాట్‌ఫామ్. ఇది బన్నీ వాస్‌కు షాక్ అని చెప్పవచ్చు.
Mollywood’s most successful movie, 2018 is streaming on #SonyLIV from June 7th in Malayalam, Tamil, Telugu, Kannada, and Hindi!
Directed by #JudeAnthanyJoseph
Produced by Venu Kunnappilly, C K Padma Kumar, Anto Joseph
Production House- Kavya Film Company and PK Prime Production pic.twitter.com/jkU7wvy0cd— Sony LIV (@SonyLIV) May 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.