2018 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైపోయాడు మలయాళ స్టార్ హీరో టొవినో థామస్. అంతకు ముందు ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అయ్యాయి. ఇక్కడి ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. టొవినో థామస్ నటించిన మరొక సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. అదే ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’. డార్విన్ కురియకోస్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అక్కడి ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు రావడం విశేషం. అంతేకాదు ఐఎండీబీ ఈ సినిమాకు ఏకంగా 8.4 రేటింగ్ ఇచ్చింది. ఇలా ఎన్నో విశేషాలున్న అన్వేషిప్పిన్ కండేతుమ్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ అన్వేషిప్పిన్ కండేతుమ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 8 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది నెట్ ఫ్లిక్స్.
అన్వేషిప్పిన్ కండేతుమ్ సినిమాలో వినీత్ డేవిడ్, రాహుల్ రాజగోపాల్, సిద్దిఖీ, షమ్మి తిలకన్, సాదిఖ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో టొవినో థామస్ నిజాయతీగల ఓ పోలీస్ ఆఫీసర్ ఆనంద్ నారాయణ పాత్రలో నటించాడు. రెండు హత్యకేసులను ఛేదించే బాధ్యత అతని మీద పడుతుంది. ఆ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అని ఆనంద్ తెలుసుకుంటాడు. అయితే వాటిని బయటపెట్టలేని పరిస్థితి ఎదురవుతుంది. నిందితుల గురించి తెలిసినా అరెస్ట్ చేయడు. మరి ఈ కథ ఎక్కడిదకా వెళ్లింది? ఆనంద్ ఎలా కేసులను పరిష్కరించాడు? అన్నది తెలుసుకోవాలంటే అన్వేషిప్పిన్ కండేతుమ్ సినిమా చూడాల్సిందే.
Anweshanathinaayi varunnu Anand and team 🚔 🔍
Anweshippin Kandethum, coming to Netflix on 8 March in Malayalam, Tamil, Telugu, Kannada and Hindi. #AnweshippinKandethumOnNetflix pic.twitter.com/j80BlUezg4— Netflix India South (@Netflix_INSouth) March 1, 2024
#Mollywood‘s Historic Feb has ended minting close to 200Cr🔥🔥🔥
Peak Cinema.. Peak Mollywood💥#AnweshippinKandethum#Premalu#Bramayugam #ManjummelBoys pic.twitter.com/l3YlQ18hUJ— Justin Joseph (@Justincoorg) March 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.