OTT: ఓటీటీలోకి వచ్చేసిన త్రిష ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 9 రేటింగ్.. ఎక్కడ చూడొచ్చంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచింది. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో మలయాళ స్టార్ నటుడు టొవినో థామస్ మరో కీలక పాత్రలో నటించి మెప్పించాడు.

OTT: ఓటీటీలోకి వచ్చేసిన త్రిష ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 9 రేటింగ్.. ఎక్కడ చూడొచ్చంటే?
Identity Movie

Updated on: Jan 31, 2025 | 5:37 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష నటించిన మలయాళ చిత్రం ఐడెంటిటీ. 2018 మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ నటుడు టొవినో థామస్ ఇందులో హీరో గా నటించాడు. సంక్రాంతికి కానుకగా మలయాళంలో విడుదలైన ఈ చిత్రం
బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం రెండు వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేశారు. జనవరి 24న తెలుగు రాష్ట్రాల్లో ఐడెంటిటీ సినిమా రిలీజైంది. ఇక్కడ కూడా ఈమూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇంతలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో పెద్దగా జనాలు ఈ మూవీపై ఆసక్తి చూపించలేదు. గత శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదలైన ఐడెంటీటీ సినిమా ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది. శుక్రవారం (జనవరి 31) అర్ధరాత్రి నుంచే ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఐడెంటిటీ చిత్రంలో హనుమాన్ విలన్ వినయ్ రాయ్ నెగెటివ్ రోల్ లో ఆకట్టుకున్నాడు. అలాగే బాలీవుడ్ అందాల తార మందిరా బేడీ కూడా ఓ కీలక పాత్రలో మెరిసింది. క్రైమ్ అండ్ యాక్షన్, మర్డర్ మిస్టరీ జోనర్‌లో తెరకెక్కిన ఐడెంటిటీ సినిమాకు అఖిల్ పాల్, అనాస్ ఖాన్ దర్శకత్వం వహించారు. రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఐడెంటిటీ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఐఎమ్‌డీబీ ఈ సినిమాకు 9 రేటింగ్ ఇవ్వడం విశేషం. మరి థియేటర్లలో ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మిస్ అయ్యారా? అయితే వీకెండ్ లో ఈ మూవీ మీకు మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

జీ5లో స్ట్రీమింగ్..

 

ఐడెంటిటీ తెలుగు ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.