AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : స్టూడెంట్స్ పై అమలా పాల్ రివేంజ్.. ఒక్కో సీన్ మైండ్ బ్లాంక్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే..

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో అమలా పాల్ ఒకరు. కొన్నాళ్లపాటు దక్షిణాదిలో చక్రం తిప్పిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యింది. వ్యక్తిగత విషయాలతో సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు నటించిన ఓ క్రైమ్ థ్రిల్లర్ రివేంజ్ డ్రామా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది.

Cinema : స్టూడెంట్స్ పై అమలా పాల్ రివేంజ్.. ఒక్కో సీన్ మైండ్ బ్లాంక్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే..
The Teacher
Rajitha Chanti
|

Updated on: Oct 16, 2025 | 4:23 PM

Share

ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ చిత్రాలు అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్, మిస్టరీ డ్రామా చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా మూడేళ్ల క్రితం విడుదలైంది. ఆ మూవీ పేరు ది టీచర్. 2022లో రిలీజ్ అయిన ఈ మలయాళీ రివెంజ్ డ్రామాను ఇతర భాషలలోకి డబ్ చేయగా.. థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అమలా పాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు వివేక్ దర్శకత్వం వహించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు.. ఆ తర్వాత బాధితులు ఎదుర్కోవడానికి పడిన మనోవేదన, ప్రతీకారం వంటి అంశాలను ఈ సినిమాలో చూపించారు. దాదాపు ఒక గంట 55 నిమిషాలు ఉన్న ఈ సినిమా ఆద్యంతం థ్రిల్లర్ సినీప్రియులను ఎంటర్టైన్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి : ఆ ఒక్క జ్యూస్.. 51 ఏళ్ల వయసులో మలైక అందం వెనుక రహస్యం ఇదేనట.

ఇందులో అమలా పాల్ దేవిక అనే టీచర్ పాత్రలో నటించింది. అయితే స్కూల్లో జరిగిన స్పోర్ట్స్ మీట్ సమయంలో ఆమె కొంతమంది విద్యార్థుల చేతిలో అత్యాచారానికి గురవుతుంది. ఆ తర్వాత ఆమె తీవ్రమైన మానసిక వేదనకు, భయానికి గురవుతుంది. అదే సమయంలో ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది. దీంతో తనకు జరిగిన విషయాన్ని దేవిక భర్తతో చెప్పడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. ఆ సమయంలో ఆమెకు తన అత్తయ్య అండగా నిలుస్తుంది. ఆ తర్వాత పోలీసుల సహయం లేకుండానే ఆ నలుగురు విద్యార్థులపై దేవిక ఎలా ప్రతికారం తీర్చుకుంది అనేది మిగతా స్టోరీ. ఈ సినిమాలో అమలా పాల్ యాక్టింగ్ అదరగొట్టింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‏గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..

ఈ మూవీకి IMDBలో 6.8 రేటింగ్ ఉంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతోపాటు తమిళంలో, హిందీలో అందుబాటులో ఉంది. అలాగే ఈ మూవీ హిందీ వెర్షన్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..

ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..

Follow Us
40 ఏళ్ల తర్వాత కూడా తల్లులు అవుతున్న హీరోయిన్లు
40 ఏళ్ల తర్వాత కూడా తల్లులు అవుతున్న హీరోయిన్లు
వాహనదారులకు బిగ్ అలర్ట్‌.. రెండ్రోజుల పాటు ఈ రూట్‌ క్లోజ్
వాహనదారులకు బిగ్ అలర్ట్‌.. రెండ్రోజుల పాటు ఈ రూట్‌ క్లోజ్
ఉద్యోగులకు రూ.5.14 లక్షల బకాయిలు? బేసిక్ జీతం రూ.44,900 ఉంటే ఎంత?
ఉద్యోగులకు రూ.5.14 లక్షల బకాయిలు? బేసిక్ జీతం రూ.44,900 ఉంటే ఎంత?
భారత బ్యాటర్ల విధ్వంసం.. న్యూజిలాండ్‌పై 118 పరుగుల ఆధిక్యం
భారత బ్యాటర్ల విధ్వంసం.. న్యూజిలాండ్‌పై 118 పరుగుల ఆధిక్యం
ఆంధ్రా భోజనం ఇష్టం.. దీని కోసం అనిరుధ్ ఎక్కడికి వెళ్తాడో తెలుసా?
ఆంధ్రా భోజనం ఇష్టం.. దీని కోసం అనిరుధ్ ఎక్కడికి వెళ్తాడో తెలుసా?
రిలీజ్ అయినా రోజే ఆన్‌లైన్‌లోకి.. పోలీసుల కేసు నమోదు!
రిలీజ్ అయినా రోజే ఆన్‌లైన్‌లోకి.. పోలీసుల కేసు నమోదు!
ఉప్పులో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా..? థైరాయిడ్ సమస్యలను నివారించే
ఉప్పులో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా..? థైరాయిడ్ సమస్యలను నివారించే
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు అలర్ట్.. ట్రైన్‌లో వీటిపై నిషేదం
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు అలర్ట్.. ట్రైన్‌లో వీటిపై నిషేదం
ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? రూల్స్ తెలుసా?
ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? రూల్స్ తెలుసా?
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. లక్షా 14వేలకు దిగొచ్చిన బంగారం ధర!
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. లక్షా 14వేలకు దిగొచ్చిన బంగారం ధర!