Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్‏గా మెకానిక్ కొడుకు.. ఫ్రైజ్ మనీ ఎంత వచ్చిందంటే..

|

Sep 22, 2024 | 7:34 AM

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విజయవంతంగా ముగిసింది. గత రెండు సీజన్స్ మాదిరిగానే ఈ సీజన్‏కు కూడా అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తం 26 వారాలుగా సాగిన ఈ పాట తుది సమరం ఆదివారం జరిగింది. ఈ షోలో కీర్తి, అనిరుధ్, నసీరుద్దీన్ షేక్ టాప్ 3కి చేరుకున్నారు.

Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్‏గా మెకానిక్ కొడుకు.. ఫ్రైజ్ మనీ ఎంత వచ్చిందంటే..
Telugu Indian Idol 3
Follow us on

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విజయవంతంగా ముగిసింది. గత రెండు సీజన్స్ మాదిరిగానే ఈ సీజన్‏కు కూడా అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తం 26 వారాలుగా సాగిన ఈ పాట తుది సమరం ఆదివారం జరిగింది. ఈ షోలో కీర్తి, అనిరుధ్, నసీరుద్దీన్ షేక్ టాప్ 3కి చేరుకున్నారు. హోరాహోరీగా సాగిన ఈ సంగీత ప్రయాణంలో.. నసీరుద్దీన్ విజేతగా నిలిచి టైటిల్ తోపాటు రూ.10 లక్షల ఫ్రైజ్ మనీ గెలుచుకున్నాడు. ఇక రెండో స్థానంలో అనిరుధ్ నిలిచి రూ.3 లక్షలు అందుకున్నాడు. ఆ తర్వాత మూడో స్థానంలో శ్రీ కీర్తి రూ.2 లక్షలు గెలుచుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సింగర్స్ గీతా మాధురి, కార్తీక్ టైటిల్, ఫ్రైజ్ మనీ అందించారు. అలాగే విజేతగా నిలిచిన నసీరుద్ధీన్ కు థమన్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రంలో సాంగ్ పాడే అవకాశం ఇస్తున్నట్లు తెలిపాడు.

నసీరుద్దీన్.. 2004 నవంబర్ 2న తాడేపల్లిగూడేంలో షేక్ బాజీ, మదీనా బీబీ దంపతులకు జన్మించాడు. తండ్రి షేక్ బాజీ మోటార్ మెకానిక్.. తల్లి మదీనా బీబీ గతేడాది మరణించారు. ఆ తర్వాత నసీరుద్ధీన్ కు అతడి సోదరి వహీదా రెహ్మాన్ అండగా నిలిచారు. తాతా కాసీం సాహెబ్, అమ్మమ్మ ఫాతిమా బీ కలిసి నసీరుద్ధీన్ ను సంగీతం వైపు ప్రోత్సహించారు. అతడి అమ్మమ్మ ఫాతిమా బీకి సంగీతంలో ప్రవేశం ఉండడంతో సంగీతంలో శిక్షణ ఇచ్చింది. చిన్నప్పటి నుంచే అమ్మమ్మ వద్ద పాటలు పాడుతూ పెరిగాడు. తెలుగు ఇండియన్ ఐడల్ విజతేగా నిలిచిన తర్వాత తన తాత, అమ్మమ్మను గుర్తుచేసిన ఎమోషనల్ అయ్యాడు నసీరుద్ధిన్. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 టైటిల్ గెలవడం తనకు ప్రత్యేకమైన మైలు అని అన్నాడు.

నసీరుద్ధీన్ గుంటూరులోని శ్రీమేధా కామర్స్ కాలేజీలో సీఏ చేశాడు. ఇటు సంగీతం పట్ల తనకున్న అభిరుచిని కొనసాగిస్తూనే చార్డర్ట్ అకౌంటెంట్ విద్య అభ్యసించాడు. తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపిటేషన్ ప్రయాణంలో ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది. ఇప్పటివరకు ఎంతో మంది సింగర్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. గతంలో వచ్చిన రెండు సీజన్స్ కూడా విజయవంతంగా ముగిశాయి. ఇప్పుడు సీజన్ 3 కు మంచి వ్యూస్ దక్కించుకుంది. ఈ సీజన్ మొత్తం 12 మంది కంటెస్టెంట్స్ తలపడగా.. చివరకు ముగ్గురు ఫైనల్ కు చేరుకున్నారు. వీరిలో నసీరుద్ధీన్ విజేతగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.