Telugu Indian Idol 2: వేదికపై గాత్రంతో అదరగొట్టిన జవాన్.. తెలుగు ఇండియన్ ఐడల్ జడ్జీలు ఫిదా.. కానీ..

|

Feb 28, 2023 | 10:04 AM

మార్చి 3 నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం ఏడు గంటలకు ప్రీమియర్ కానుంది. అయితే గతంలో ఉన్నట్లు కాకుండా.. ఈసారి నిత్యా మీనన్ స్థానంలో సింగర్ గీతామాధురి న్యాయనిర్ణేతగా కనిపించనున్నారు.

Telugu Indian Idol 2: వేదికపై గాత్రంతో అదరగొట్టిన జవాన్.. తెలుగు ఇండియన్ ఐడల్ జడ్జీలు ఫిదా.. కానీ..
Telugu Indian Idol
Follow us on

ప్రస్తుతం తెలుగు ఓటీటీ ప్రపంచంలో టాక్ షోస్, గేమ్ షోస్, సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. ఇందులో సక్సెస్ అయిన షోలలో తెలుగు ఇండియన్ ఐడల్ ఒకటి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిత్యా మీనన్, సింగర్ కార్తిక్ లు జడ్జీలుగా వ్యవహరించిన మొదటి సీజన్‏కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చింజీవి గ్రాండ్ ఫైనల్ కు అతిథిగా రాగా.. ఇందులో వాగ్దేవి విజేతగా నిలిచింది. ఇక ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2కి రంగం సిద్ధమైంది. మార్చి 3 నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం ఏడు గంటలకు ప్రీమియర్ కానుంది. అయితే గతంలో ఉన్నట్లు కాకుండా.. ఈసారి నిత్యా మీనన్ స్థానంలో సింగర్ గీతామాధురి న్యాయనిర్ణేతగా కనిపించనున్నారు. అలాగే సింగర్ హేమచంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే షో రన్నర్స్ ఆడిషన్స్ కంప్లీట్ చేశారు మేకర్స్.

ఇక తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ఈ వారం స్ట్రీమింగ్ కానుంది. మొదటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన వీడియోలో మొదటగా.. బీఎఫ్ఎస్ జవాన్ చక్రపాణి వేదికపైకి వచ్చారు. మీ పోస్టింగ్ ఎక్కడా అని తమన్ ప్రశ్నించగా.. ఇండియన్ పాకిస్థాన్ బార్డర్ వచ్చానని అన్నారు. తనకు ప్రాక్టిస్ చేసేందుకు టైమ్ ఉండదని.. డ్యూటీ చేస్తూ పాడుతుంటానని అన్నారు. అనంతరం నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా నుంచి ఘల్.. ఘల్ పాటతో అదరగొట్టారు. చక్రపాణి పాటకు జడ్జీలు ఫిదా కావడమే కాకుండా యస్ అంటూ తమ అభిప్రాయం తెలియజేశారు. అయితే జడ్జీలు యస్ అని చెప్పగా.. చక్రపాణి నో అంటూ షాకిచ్చారు.

తనకు ఇచ్చిన సెలవులు ముగిశాయని.. బార్డర్‏కు తిరిగి వెళ్లే సమయం వచ్చిందని అన్నారు. అయితే అధికారులతో మాట్లాడి మీరు ఉండేందుకు ఏమైనా చేయ్యొచ్చా అంటూ తిరిగి ప్రశ్నించారు తమన్. మరీ చక్రపాణి చెప్పిన సమాధానం ఏంటీ ?.. తెలుగు ఇండియన్ ఐడల్ షోలో చక్రపాణి మరింత ముందుగా వెళ్లగలడా అనేది తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ వరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.