Hanuman OTT: ‘హనుమాన్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్‌కు రానున్న బ్లాక్‌ బస్టర్

|

Feb 17, 2024 | 5:14 PM

జనవరి 12న విడుదలైన హనుమాన్‌ బ్లాక్‌ బస్టర్ గా  నిలిచింది. నిర్మాతలకు కాసుల పంట పండించింది. థియేటర్లలో రిలీజై నెలన్నర రోజులు పూర్తవుతున్నా ఇప్పటికీ కలెక్షన్లు వస్తున్నాయి. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటివారందరికీ ఓ గుడ్‌ న్యూస్‌. త్వరలోనే ఈ బ్లాక్‌ బస్టర్‌ మూవీ స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌..

Hanuman OTT: హనుమాన్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్‌కు రానున్న బ్లాక్‌ బస్టర్
Hanuman Movie
Follow us on

యంగ్‌ హీరో తేజ సజ్జా, డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్‌’. మన దేశంలో సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీ ఇదే. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్‌ బ్లాక్‌ బస్టర్ గా  నిలిచింది. నిర్మాతలకు కాసుల పంట పండించింది. థియేటర్లలో రిలీజై నెలన్నర రోజులు పూర్తవుతున్నా ఇప్పటికీ కలెక్షన్లు వస్తున్నాయి. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటివారందరికీ ఓ గుడ్‌ న్యూస్‌. త్వరలోనే ఈ బ్లాక్‌ బస్టర్‌ మూవీ స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 హనుమాన్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో తేజ సజ్జా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది. మార్చి 2 నుంచే హనుమాన్‌ సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారని టాక్‌ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

టికెట్ల ధరలు తగ్గింపు..

కాగా థియేట్రికల్‌ రిలీజ్ జరిగిన తర్వాత 3-4 వారాల గ్యాప్‌లోనే హనుమాన్ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలనుకున్నారు. అయితే ఆడియెన్స్‌ నుంచి రెస్పాన్స్‌ రోజురోజుకు పెరిగిపోవడంతో స్ట్రీమింగ్‌ ను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు థియేట్రికల్‌ రన్‌ కూడా ఆఖరికి వచ్చేయడంతో మార్చి 2 నుంచి హనుమాన్‌ సినిమా అన్ని భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది. కాగా హనుమాన్‌ మూవీ టికెట్ల ధరలపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించారు మేకర్స్‌.ప్రస్తుతం సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్స్‌లో హను-మాన్‌ టికెట్‌ ధర రూ.175లుగా ఉంది. ఇకపై ఈ టికెట్స్‌ రూ.100ల కే లభించనున్నాయి. అలాగే మల్టీప్లెక్స్‌లలో రూ.295గా ఉన్న టికెట్‌ ధరను ఏకంగా రూ.150 కి తగ్గించారు. ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటాయని మేకర్స్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్..

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్..

హిందీలోనూ కలెక్షన్ల సునామీ..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.