Mirai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మిరాయ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..

ఇటీవల బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా మిరాయ్. తేజా సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు.

Mirai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మిరాయ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
Mirai

Updated on: Oct 04, 2025 | 12:48 PM

హనుమాన్ సినిమాతో హీరోగా సక్సెస్ అందుకున్న తేజా సజ్జా.. ఇటీవల మిరాయ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంలో మంచు మనోజ్ కీలకపాత్రలో నటించారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని విజువల్స్, బీజీఎమ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా తేజా సజ్జా, మంచు మనోజ్ యాక్టింగ్ కు అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాలోని ప్రతీ సీన్ హైలెట్ అయ్యింది. ఇందులో రితిక నాయక్ కథానాయికగా నటించింది. ఇన్నాళ్లు థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ వేదికగా అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఓ పోస్టర్ పంచుకుంది. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, హిందీ, తమిళం భాషలలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. దీంతో ఇన్నాళ్లు థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్సైన అడియన్స్ ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

కథ విషయానికి వస్తే..
సామ్రాట్ అశోక్ కళింగ యుద్దం గెలిచాక.. జరిగిన విధ్వంసాన్ని తలుచుకుని పశ్చాత్తాప్పడతాడు. ఆ వినాశనానికి తనలోని దైవశక్తే ఓ కారణమని భావించి.. ఆ శక్తిని తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేసి.. వాటి రక్షణ బాధ్యతను తొమ్మిది మంది యోధుల చేతుల్లో పెడతాడు. కొన్ని శతాబ్దాల తర్వాత ఆ గ్రంథాలపై దుష్టశక్తి మహావీర్ లామా (మంచు మనోజ్ ) కన్ను పడుతుంది. ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలంటే తొమ్మిదో గ్రంథం అవసరమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. ? తొమ్మిదో గ్రంథానికి రక్షణగా ఉన్న అంబిక ఎవరు.. ? తేజా సజ్జాకు ఆమెకు ఉన్న బంధం ఏంటీ ? అనేది సినిమా.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..