Joe Movie: మనసులను కదిలిస్తోన్న లవ్ ఫెయిల్యూర్ మూవీ.. ఓటీటీ తమిళ్ సూపర్ హిట్..

కోలీవుడ్ డైరెక్టర్ హరిహరన్ రామ్ ఎస్ దర్శకత్వం వహించిన 'జో' సినిమాలో భవ్య త్రిఖ, మాళవిక మనోజ్, రియో రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. గతేడాది నవంబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కంటెంట్ ప్రాధాన్యత.. నటీనటుల యాక్టింగ్ పై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్‏తో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ జనవరి 15 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

Joe Movie: మనసులను కదిలిస్తోన్న లవ్ ఫెయిల్యూర్ మూవీ.. ఓటీటీ తమిళ్ సూపర్ హిట్..
Joe Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 20, 2024 | 7:02 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సినిమా సెన్సెషన్ అవుతుంది.. ఎమోషనల్ రీల్స్‏‏తో యూత్‏కు తెగ కనెక్ట్ అయిపోతుంది. నెటిజన్స్ మనసులను కదిలిస్తోన్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. అదే ‘జో’.. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోనూ సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఈ మూవీ తెగ నచ్చేసింది. చాలా రోజుల తర్వాత రాజారాణి వంటి ప్రేమకథ వచ్చిందని అంటున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ హరిహరన్ రామ్ ఎస్ దర్శకత్వం వహించిన ‘జో’ సినిమాలో భవ్య త్రిఖ, మాళవిక మనోజ్, రియో రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. గతేడాది నవంబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కంటెంట్ ప్రాధాన్యత.. నటీనటుల యాక్టింగ్ పై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్‏తో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ జనవరి 15 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

‘జో’ సినిమా కథేంటంటే..

జో (రియో రాజ్) ఆర్థికంగా బలపడిన కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి. చిన్నప్పటి నుంచే ఎంతో సరదాగా.. జాలీగ ఎంజాయ్ చేస్తూ లైఫ్ గడిపేస్తాడు. కాలేజీలో సుచిత్ర (మాళవిక మనోజ్) కేరళకు చెందిన అమ్మాయి. ఎంతో సున్నితత్వం మనస్సు ఉన్న తనను చూడగానే ప్రేమలో పడతాడు. చివరకు సుచిత్ర కూడా జో ను ప్రేమిస్తుంది. ఇద్దరూ తమ కాలేజీ పూర్తిచేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే ఇద్దరి మధ్య కొన్ని గొడవలు జరగడంతో ఒక ఆరు నెలలు మాట్లాడకుండా ఉండాలని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్లిపోతుంది. ఆరు నెలల తర్వాత సుచిత్ర ఫోన్ చేసి పెళ్లి గురించి మాట్లాడమన చెప్తుంది. దీంతో ఆమెను వివాహం చేసుకోవాలని జో వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతాయి. దీంతో జో, సుచిత్ర మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. దీంతో సుచిత్ర జోకు బ్రేకప్ చేప్పేస్తుంది ఆ తర్వాత సుచిత్రకు మరొకరితో పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు ఆమె తల్లిదండ్రులు. అటు జో కూడా తన తల్లిదండ్రులు చూసిన శ్రుతి (భవ్య త్రిఖా)ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. కానీ జోను పెళ్లి చేసుకోవడం శ్రుతికి ఇష్టం ఉండదు.. ఆ తర్వాత వారిద్దరి జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి అనేది సినిమా.

తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో మంచి ఆదరణ అందుకుంటుంది. ప్రేమమ్, హృదయం, రాజారాణి లాంటి హిట్ సినిమాలతో ఈ చిత్రానికి పోలిక ఉంది. అయినప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలు యూత్‏కు ఎక్కువగా కనెక్ట్ కావడం వల్ల ఈ చిత్రానికి మరోసారి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రానికి సిద్దూ కుమార్ అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ