AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aranmanai 4 OTT: ఓటీటీలోకి వచ్చేసిన 100 కోట్ల హారర్ కామెడీ సినిమా.. ‘అరణ్మనై 4’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అందాల భామలు తమన్నా భాటియా, రాశీఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్ర అరణ్మనై 4. తెలుగులో బాకుగా రిలీజైంది. తమిళ, తెలుగు భాషల్లో మే 3న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను భయపెట్టిస్తూనే కడుపుబ్బా నవ్వించింది. తమిళంలో ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్లు కొల్లగొట్టడం విశేషం.

Aranmanai 4 OTT: ఓటీటీలోకి వచ్చేసిన 100 కోట్ల హారర్ కామెడీ సినిమా.. 'అరణ్మనై 4' స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Aranmanai 4 Movie
Basha Shek
|

Updated on: Jun 21, 2024 | 9:26 AM

Share

అందాల భామలు తమన్నా భాటియా, రాశీఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్ర అరణ్మనై 4. తెలుగులో బాకుగా రిలీజైంది. తమిళ, తెలుగు భాషల్లో మే 3న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను భయపెట్టిస్తూనే కడుపుబ్బా నవ్వించింది. తమిళంలో ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్లు కొల్లగొట్టడం విశేషం. అయితే తమిళంలో అంతగా కాకపోయినా తెలుగులోనూ బాకు సినిమాకు ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. ఇలా థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన అరణ్మనై 4 ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ కామెడీ హారర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (జూన్ 21వ తేదీ) అర్ధరాత్రి నుంచి అరణ్మనై 4 సినిమాను ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులోకి తెచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ అరణ్మనై 4 స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ఈవిషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింద డిస్నీ ప్లస్ హాట్ స్టార్. కాగా తమిళంలో అరణ్మనై కామెడీ ఫ్రాంచైజీ సిరీస్ సినిమాలకు బాగా ఆదరణ ఉంది. ఈ సిరీస్ లో ఇప్పటివరకు రిలీజైన మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు నాలుగో సినిమా కూడా రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది.

ప్రముఖ నటి ఖుష్బూ భర్త సుందర్ తెరకెక్కించిన అరణ్మనై 4 సినిమాలో కేజీఎఫ్ రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్, కోవై సరళ, యోగిబాబు, ఢిల్లీ గణేశ్, జయప్రకాశ్, ఫ్రెడ్రిక్ జాన్సన్ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. అన్వి సినీమ్యాక్స్, బెంజ్ మీడియా బ్యానర్లపై ఖుష్బూ సుందర్, అరుణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. హిప్‍హాప్ తమిజా స్వరాలు సమకూర్చారు. ఇందులో తమన్నా ఆత్మగా నటించడం విశేషం. పైగా ఇందులోని అచ్చో అచ్చచ్చో అనే ప్రమోషనల్ సాంగ్ లో తమన్నా, రాశీఖన్నాలు కలిసి సూపర్బ్ గా స్టెప్పులేశారు. మరి థియేటర్లలో అరణ్మనై సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..